ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి మ‌రో ఛాన్స్ ఇచ్చిన నాగ్‌

నాగార్జున లెక్క‌ల‌న్నీ వేరుగా ఉంటాయి. త‌న‌కు హిట్టూ, ఫ్లాపుల‌తో సంబంధం ఉండ‌దు. కాన్సెప్ట్ న‌చ్చితే… భుజం త‌ట్టి ప్రోత్స‌హిస్తుంటాడు. అలా చాలామంది ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిచ్చాడు. ఇప్పుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కి నాగ్ మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. చిల‌సౌతో త‌న‌లోనూ ఓ ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని నిరూపించుకున్నాడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. ఆ వెంట‌నే నాగార్జున‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. రాహుల్ ని న‌మ్మి నాగ్ ఓ ఛాన్స్ ఇచ్చాడు. త‌న‌కు ఇష్ట‌మైన `మ‌న్మ‌థుడు` టైటిల్ నీ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చాడు. అయితే `మ‌న్మ‌థుడు 2` డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ తర‌వాత రాహుల్ క‌నిపించ‌కుండా పోయాడు.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో రాహుల్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. అందుకు స‌న్నాహాల‌న్నీ పూర్త‌య్యాయ‌ని టాక్‌. అయితే ఇందులో నాగార్జున హీరో కాదు. అక్కినేని హీరోలెవ‌రూ క‌నిపించ‌రు. పూర్తిగా కొత్త‌వాళ్ల‌తో రాహుల్ ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. చిల‌సౌ లానే ఓ కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌ని రాహుల్ తెర‌పై చూపించ‌బోతున్నాడ‌ట‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించ‌బోతోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close