జెంటిల్‌మెన్‌.. మూడ్రోజుల్లో ఎంత‌?

నాని – ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం జెంటిల్‌మెన్‌. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగిన ఈ సినిమాకి బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లిత‌మే వ‌చ్చింది. నానికున్న ఇమేజ్‌, జెంటిల్‌మెన్ టైటిల్‌, ఇంద్ర‌గంటి స్టైల్ ఆఫ్ మేకింగ్‌.. ఇవ‌న్నీ ఈ సినిమాకి హెల్ప్ అయ్యాయి. తొలి రోజు నుంచే హౌస్‌ఫుల్స్ బోర్డులు క‌నిపించాయి. మిగిలిన సినిమాల నుంచి గ‌ట్టి పోటీ లేకపోవ‌డంతో ఈ వీక్ ఎండ్‌ని బాగా క్యాష్ చేసుకొందీ సినిమా. మూడు రోజుల‌కు క‌లిపి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.8.9 కోట్లు సాధించింది. నైజాంల‌తో రూ.2.5 కోట్లు ద‌క్కాయి. ఓవ‌ర్సీస్‌లోనూ రూ.2 కోట్లు యాడ్ అయ్యాయి. ఏ సెంట‌ర్ల‌లో సోమ‌వారం కూడా వ‌సూళ్లు స్ట‌డీగా ఉన్న‌ట్టు రిపోర్ట్ వ‌స్తోంది. ఈవారం కూడా జెంటిల్‌మెన్ వ‌సూళ్ల‌కు ఢోకా లేక‌పోవొచ్చు. త‌క్కువ బ‌డ్జెట్‌లో ఈ సినిమాని తీయ‌డం.. మంచి రేట్ల‌కు అమ్ముకోవ‌డంతో నిర్మాత ముందే లాభాల బాట ప‌ట్టాడు. ఇక నుంచి వ‌చ్చిందంతా బోన‌సే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరివీ..? ఎందుకీ అస్పష్టత..?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో...

ఎంపీ ఎన్నికలు…హైదరాబాద్ లో కర్ఫ్యూ..!!

హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళడంతో నగరమంతా బోసిపోయింది. ఇది హైదరాబాదేనా అనుమానం వచ్చేలా హైదరాబాద్ నిర్మానుష్యంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close