శ్వేత : వైసీపీకి సీట్లు – బీజేపీకి స్వీట్లు..! జాతీయ మీడియా సర్వేల కథ..!!

జాతీయ మీడియాలో.. ముఖ్యంగా.. బీజేపీకి హార్డ్ కోర్ సపోర్టర్లుగా ఉన్న మీడియా చానళ్లలో.. ఎందుకు వైసీపికి ఏకపక్షంగా పార్లమెంట్ సీట్లు వస్తాయని ప్రకటిస్తున్నారు..? . జాతీయ అంశాలతో ముడిపడిన పార్లమెంట్ ఎన్నికల్లో.. అసలు జాతీయ స్థాయిలో ఎలాంటి పాత్రా లేని.. చేయడానికి.. చేతకాని.. చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వైసీపీకి ఏపీ ప్రజలు ఏకపక్షంగా ఓట్లేస్తారని వాళ్లెలా చెబుతున్నారు..? దీని వెనుక ఉన్న లోగుట్టేమిటి..?. అయితే ఇది ఆషామాషీగా ఏం జరగడం లేదు. చాలా పెద్ద స్కెచ్ ఉందని.. వరుసగా జరుగుతున్న పరిణామాలను చూసి నిర్ధారించుకోవచ్చు.

వైసీపీకి సానుకూలత ఉంటే బీజేపీ ఉన్నట్లేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందనే భావన ఉంది. బీజేపీకి ఎలాంటి ఓట్లు, సీట్లు వచ్చే పరిస్తితి లేదు. ప్రజల సెంటిమెంట్ ను.. మోదీ చాలా తీవ్రంగా దెబ్బతీశారు కాబట్టి.. స్పందనలూ అలాగే ఉన్నాయి. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే మోడీ రావాలా.. వద్దా అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. హోదా విషయంలో ఏపీ ప్రజల భావోద్వేగాలు వీలైనంతగా తగ్గిస్తేనే అది సాధ్యమని నమ్ముతున్నారు. అలా చేయాలంటే.. ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయగలగాలి. అందుకే వ్యూహాత్మంగా బీజేపీ… వ్యవహరిస్తోంది. తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం .. ఏపీలో ఉందన్న భావన.. కల్పించడానికి … జాతీయ మీడియాను ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పడిపోతున్న బీజేపీ గ్రాఫ్ ను..వీలైనంత తక్కువగా చూపించడానికి… వారికో సర్వేను విడుదల చేస్తున్న బీజేపీకి దగ్గరగా ఉన్న మీడియా సంస్థలు.. ఏపీలో వైసీపీ హవా.. అంటూ… భారీగా సీట్లను ఉదారంగా ప్రకటించేస్తోంది. దాన్ని వైసీపీ, జగన్ మీడియా మరింత ఉద్ధృతంగా ప్రచారం చేసుకుని గాలి తమ వైపు ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది.ఇలాంటి వాతావరణం ప్రజల్లో ఏర్పడితే.. సహజంగానే.. బీజేపీ అనుకూల ప్రభుత్వం వస్తందన్న ఉద్దేశంతోనే బీజేపీ ఈ తరహా సర్వేలను విడుదల చేస్తోందన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఉంది.

వైసీపీకి ఓటేసి ఏపీ ప్రజలు మోడీకి మద్దతు పలుకుతారా..?

భారతీయ జనతా పార్టీకి ..వైసీపీ చాలా దగ్గరగా వ్యవహరిస్తోందన్నది.. బహిరంగ రహస్యం. నాలుగున్నరేళ్లలో బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. విభజన హామీలపై.. ఏ విషయంలో ఢిల్లీ సర్కార్ పై .. ఒత్తిడి పెరిగేలా.. ఎలాంటి కార్యాచణ చేపట్టలేదు. అసలు బీజేపీకి వ్యతిరేకంగా ఏమీ చేయని.. వైసీపీకే ప్రజల ఆదరణ ఉందని… చెప్పడమే.. అసలు వ్యూహం అని అంటున్నారు. అంటే.. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్న భావన.. ప్రజల్లోకి వెళ్తోందని.. గట్టిగా నమ్ముతున్నారు. జాతీయ మీడియా కూడా..ఇప్పుడు వచ్చేది ఏ ప్రభుత్వం అని వేస్తున్న లెక్కల్లో.. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీలను వేరు వేరుగా చూడటం లేదు. వారి కలిస్తే.. బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. అంటే.. ఢిల్లీ స్థాయి.. వైసీపీ, బీజేపీ ఒక్కటేనన్న క్లారిటీ ఉంది. అందుకే పార్లమెంట్ సీట్ల విషయంలో.. వైసీపీకి అనుకూలమైన ఫలితాలను.. బీజేపీ వ్యూహకర్తలు ప్రకటించేలా చేస్తున్నారు.

సర్వేల పేరుతో ఏపీ ప్రజల్ని బకరాల్ని చేస్తున్నారా..?

చంద్రబాబునాయుడు.. బీజేపీని మరో సారి అధికారంలోకి రానివ్వకూడదన్న పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. అందుకే ముందుగా చంద్రబాబును టార్గెట్ చేశారు.. చంద్రబాబును ఓడించాలంటే.. తమ వ్యూహాలు.. ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న జగన్ కోసమే కేటాయించాలి. అదే పని చేస్తున్నారు. ఏపీలో మోదీ పోటీ చేసినా… డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ… ఉద్ధృతంగా… ప్రచార కార్యక్రమాలు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం.. వైసీపీకి నైతిక బలం అందించడమే. ఏపీలో వైసీపీకి వచ్చే సీట్లు నికరంగా బీజేపీ ఖాతాలో పడతాయి. తమిళనాడులో వారికి అండగా ఉంటారనుకున్న పార్టీకి నాయకత్వం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ కలిస్తే.. బీజేపీకి ఎన్ని వస్తాయో చెప్పలేరు. తెలంగాణలో తమకు అనుకూల పార్టీనే ఉంది.. ఆ పార్టీకే పాజిటివ్ వేవ్ ఉందని.. అసెంబ్లీ ఎన్నికల్లో తేలింది కాబట్టి.. ఇక వారు అక్కడ అడుగు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక మిగిలింది… ఏపీ. ఏపీ ప్రజల్ని ఏదో విధంగా.. వైసీపీ వైపు నెట్టేస్తే.. ఆ వచ్చే సీట్లన్నీ తమనేనని.. గట్టిగానే అంచనా వేసుకున్నారు. దాని ప్రకారమే… రాజకీయం ప్రారంభించారు. ఏపీ ప్రజల్ని బకరాలను చేయాలనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close