హీరోయిన్ లేకుండానే.. సెట్స్‌పైకి

నంద‌మూరి బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అంగ‌రంగ‌వైభ‌వంగా ప్రారంభ‌మైంది. సినీ, రాజ‌కీయ పెద్ద‌లొచ్చి… బాల‌య్య‌ను దీవించి వెళ్లారు. సిల్వ‌ర్ జూబ్లీ ఆడాల‌ని మ‌న‌సారా కోరుకొన్నారు. ఇక అంద‌రి చూపూ ఈ సినిమా ఎప్పుడొస్తుంద‌నేదానిపైనే కేంద్రీకృతం అయ్యింది. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ డేట్ కూడా ఫిక్స‌యిపోయింది. మే 9 నుంచి షూటింగ్‌ప్రారంభిస్తారు. తొలి షెడ్యూల్ ప‌ది హేనురోజుల పాటు జ‌ర‌గ‌బోతోంది. అంతా బాగానే ఉందిగానీ.. హీరోయిన్ మాత్ర‌మే సెట్ కావ‌డం లేదు. తొలి షెడ్యూల్‌ని హీరోయిన్ లేకుండానే ప్రారంభించేస్తున్నారు. నిజానికి హీరోయిన్ డేడ్స్ జూన్‌, జులైల‌లో కావాలి. న‌య‌న‌తార‌కు ఆ టైమ్ లో అస్సలు ఖాళీ లేద‌ట‌. అందుకే.. ‘నో’ చెప్పింద‌ని స‌మాచారం.

పోనీ న‌య‌న‌కోసం రెండు నెల‌లు ఆగుదామంటే ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దాంతో.. చిత్ర‌బృందం ఆలోచ‌న‌లో ప‌డింది. న‌య‌న‌ను భ‌ర్తీ చేసే స‌త్తా.. ప్ర‌స్తుతం ఉన్న ఏ క‌థానాయిక‌కూ లేద‌న్న‌ది బాల‌య్య అభిప్రాయ‌మ‌ట‌. మ‌రి.. న‌య‌న‌ని ఎలా ఒప్పిస్తారో, ఈ సినిమాలో ఎలా తీసుకొస్తారో అన్న‌ది ఆస‌క్తిగా మారింది. 2017 సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌న్న‌ది క్రిష్ ఉద్దేశం. అందుకే.. హీరోయిన్ గురించి అట్టేకాలం వేచి చూడ‌డం మంచిది కాద‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి ఈ హీరోయిన్ స‌మ‌స్య ఎప్పుడు, ఎలా, ఎవ‌రితో తీరుతుందో చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close