విశాఖ ఆస్తుల తాకట్టుకు కొత్త కార్పొరేషన్…!

విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇలా తాకట్టు పెట్టడానికి కొన్ని ఆస్తులను అప్పుల కోసం సృష్టించిన స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే ఆస్తులను గుర్తించి.. నివేదిక రెడీ చేశారు. తదుపరి కేబినెట్ భేటీలో ఆస్తుల బదలాయింపు నిర్ణయం తీసుకుంటారు. అయితే అంతటితో వదిలి పెట్టడం లేదు. బీచ్ కారిడార్ అభివృద్ధి కోసం… మరో కార్పొరేషన్ ఏర్పాటు చేసి..భారీగా రుణ సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం వినూత్నంగా ఆలోచించి ‘బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్’ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.

“బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్’ అంటే… బీచ్ రోడ్ లో రిసార్టులు, రెస్టారెంట్, గోల్ఫ్ కోర్టులు నిర్మించడం అన్నమాట. మరి వీటికినిధులు ఎక్కడి నుంచి వస్తాయి. అప్పులు చేయాలి. అప్పులు చేయాలంటే.. ఆ కార్పొరేషన్‌కు కొన్ని ఆస్తులు ఉండాలి. వాటిని తనఖా పెట్టాలి. అందుకే… ఈ “బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్’కి ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నారో వాటినన్నింటినీ బదలాయించి తాకట్టు పెట్టేస్తారన్నమాట. విశాఖ-భీమిలి-భోగాపురం బీచ్ రోడ్ లో 570 ఎకరాలను ఇందు కోసం గుర్తించారు. వీటిని తాకట్టు పెట్టి దాదాపుగా రూ. వెయ్యి కోట్లు అప్పులు చేయాలని నిర్ణయించారు.

అప్పుల కోసం ఏపీ సర్కార్ కార్పొరేషన్ల మీద కార్పొరేషన్లు ప్రారంభించి.. అప్పులు చేస్తోంది. స్టేట్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో ఇప్పటికే పాతిక వేల కోట్ల దాకా అప్పులు చేసింది. మెడికల్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి… ఉన్న.. కట్టబోయే మెడికల్ కాలేజీలన్నింటినీ తనఖా పెట్టేసి..మరో పదహారు వేల కోట్ల రుణానికి ప్లాన్ వేసింది. ఇంకా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కార్పొరేషన్లు పెట్టి.. రుణాలకు ప్రయత్నిస్తోందని “బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్’ నిర్ణయంతోనే తెలిసిపోతోంది. మొత్తానికి ఆదాయం పెంచుకోకపోయినా అప్పుల్లో క్రియేటివిటీ అయినా చూపించడం రావాలని ఏపీ సర్కార్ నిరూపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close