ఈవీవీ క‌థ‌.. న‌రేష్ నిర్మాత‌

ఈవీవీ సినిమా ప‌తాకంపై ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ప‌లు చిత్రాల్ని అందించారు. అందులో ఆమె లాంటి సూప‌ర్ హిట్లున్నాయి. ఆయ‌న త‌ద‌నంత‌రం న‌రేష్ ఈవీవీ ప‌తాకంపై `బందిపోటు` రూపొందించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత క‌థానాయ‌కుడిగా న‌రేష్ కెరీర్ అమాంతం డౌన్‌ఫాల్ లో ప‌డిపోయింది. న‌రేష్‌కి ఇప్పుడు అవ‌కాశాలు రావ‌డ‌మే గ‌గ‌నం అయ్యింది.

అయితే ఈవీవీ ప‌తాకంపై ఇప్పుడు ఆయ‌న మ‌రో సినిమాని రూపొందించ‌డంలో బిజీ అయ్యార‌ని తెలుస్తోంది. అస‌లు విశేషం ఏమిటంటే… ఈ స్క్రిప్టు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ రాసుకున్న‌దే. గ‌తంలో ఆయ‌న న‌రేష్‌తో చేద్దామ‌నుకున్న ఓ క‌థ‌ని ఇప్పుడు సినిమాగా తీయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కీ, న‌రేష్‌కీ అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఓ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడ‌ని స‌మాచారం. ఇది ఈవీవీ గ‌త హిట్ చిత్రాల‌కు సీక్వెల్ అని స‌మాచారం. మ‌రి.. ఆ క‌థేమిటో, సినిమా ఎప్పుడో.. న‌రేషే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close