హోదాపై అవే మాటలు.. ! ఏపీ సీఎంను అవమానిస్తున్న కేంద్రం..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్రం అవమానిస్తోంది. ప్రత్యేకహోదా విషయంలో.. ఆయన చేసిన విజ్ఞప్తులపై ఎలాంటి సమాధానం ఇవ్వకుండా.., పార్లమెంట్‌లో మాత్రం.. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మూడు సార్లు అధికారికంగా రికార్డెడ్‌గా.. ముఖ్యమంత్రి ప్రత్యేకహోదా ప్రస్తావన తీసుకు వచ్చారు. అవి కూడా అత్యున్నత స్థాయి సమావేశాలే .. అయినప్పటికీ పార్లమెంట్‌లో మాత్రం… ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశమే లేదని… ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రకటింప చేశారు.

మూడు అత్యున్నత మీటింగ్‌లలో హోదా ప్రస్తావన తెచ్చిన జగన్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ప్రత్యేకహోదా సాధన లక్ష్యంగా… ఎన్నికలలో గెలిచిన తర్వాత.. మూడు సార్లు.. అత్యున్నత సమావేశాల్లో హోదా ప్రస్తావన తీసుకు వచ్చారు. గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి… ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో హోదా అంశం గురించి చర్చించారు. ఆ తర్వాత నీతిఆయోగ్ మీటింంగ్‌లోనూ.. అదే ప్రస్తావన తెచ్చారు. దాదాపు తన ప్రసంగంలో అరవై శాతం.. ప్రత్యేకహోదాకే కేటాయించారు. ఆ తర్వాత.. అన్ని పార్టీలతో.. మోడీ, షా జరిపిన అఖిలపక్ష మీటింగ్‌లోనూ హోదా ప్రస్తావన తెచ్చారు. కానీ.. ఇంత వరకూ… వాటికి… కేంద్రం నుంచి సమాధానం రాలేదు. కానీ… ఆర్థిక మంత్రి మాత్రం… హోదా అంశం ముగిసిన అధ్యాయమంటూ..పార్లమెంట్‌లో ప్రకటించి ఏపీ సీఎంకు తాము పెద్దగా విలువ ఇవ్వడం లేదన్నట్లుగా వ్యవహరించారు.

ఏపీ అసెంబ్లీ తీర్మానం సంగతేమిటి..?

ఢిల్లీలో జరిగిన మీటింగ్‌లలోనే కాదు… ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనూ జగన్మోహన్ రెడ్డి… తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా శ్వాస అని తేల్చి.. ఆ మేరకు.. తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు. ఈ తీర్మానానికి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా కేంద్రం.. పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. గత ప్రభుత్వం లో చేసినట్లుగానే.. ఈ ప్రభుత్వంతోనూ… బీజేపీ వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికీ “ప్లీజ్.. ప్లీజ్ ” అని అడుగుతూ ఉంటే ఏపీకి గౌరవం ఉంటుందా..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మోడీని మొట్టమొదటి సారి కలిసినప్పుడు.. ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటానని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ” ప్లీజ్.. ప్లీజ్..” అని అడగడం తప్ప.. ఇంకేమీ చేయలేమని… అప్పుడే చేతులెత్తేశారు. అలా పలుమార్లు అడిగినా.. నెల రోజుల్లోనే.. ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయమని… కేంద్రం పదేపదే మంత్రులతో చెప్పించింది. ఆ తర్వాత పార్లమెంట్‌లోనూ చెప్పించింది. ఇంత జరిగిన తర్వాత కూడా.. జగన్మోహన్ రెడ్డి.. ఏపీ సీఎం హోదాలో… “ప్లీజ్.. ప్లీజ్ ” అని అడుగుతూనే ఉంటానని చెబితే.. అది కచ్చితంగా ఏపీని అగౌరవపర్చడమే అవుతుంది. పోరాడితే.. కాస్తంత గౌరవం అయినా ఉంటుంది. మరి ఏపీ సీఎం ఏ బాటలో వెళ్తారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close