కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర అనాథ..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ గల్లంతయింది. ఫలానా ప్రాజెక్టుకు ఇంత మొత్తం కేటాయిస్తున్నామని ఒక్కటంటే ఒక్కటీ చెప్పలేదు. విజయవాడ – ఖరగ్‌పూర్ మధ్య రవాణా కారిడర్ ప్రతిపాదించారు., ఇతమిత్థంగా వినిపించిన ఏపీ పేరు అదొక్కదాంట్లోనే. విభజన చట్టాల ప్రకారం నెరవేర్చాల్సిన హామీలు కొండంత ఉండగా… వాటిని కదిలిస్తే… చాలా పెద్ద సమస్యలు వస్తాయని అనుకున్నారేమో కానీ.. దేనికీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన కూడా లేదు. గతంలో వెయ్యి కోట్లు అయినా కేటాయించేవారు ఈ సారి అది కూడా కేటాయిస్తున్నట్లుగా నిర్మలమ్మ ప్రకటించలేదు.

ఏపీలో కేంద్ర సంస్థలకు కేటాయింపుల గురించి చెప్పలేదు. అరకొర కేటాయింపుల గురించి తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు హయాంలో విభజన చట్టాల ప్రకారం రావాల్సిన అనేక కేంద్ర సంస్థలను తీసుకొచ్చారు. వాటికి కొంత అయినా నిధులు కేటాయించారు. కానీ ఇప్పుడుఅది కూడా లేదు. ఇప్పుడు కేటాయిస్తున్న నిష్ఫత్తి ప్రకారం చూస్తే.. ఆ కేంద్ర సంస్థలు పూర్తిగా నిలదొక్కుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. ఇక ఎంతగానే ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రస్తావన లేదు. విశాఖ, విజయవాడల్లో మెట్రో ప్రతిపాదనలు ఉన్నాయి. విభజన చట్టంలో కూడా ఉంది. కానీ కేంద్రం పట్టించుకోలేదు.

పన్నుల్లో వాటాలివ్వడమే గొప్ప అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 15 వ ఆర్ధిక సంఘం నివేదిక ప్రకారం.. ఏపీలోటులో ఉందని గుర్తించారు. దీని ప్రకారం..2021 – 26 మధ్య 5 ఏళ్లకు రూ.30,497 కోట్లు ఏపీకి లోటు కింద ఇస్తారు. సగటున ఏడాదికి రూ. ఆరు వేల కోట్లు ఇస్తారు. ఐదేళ్ల కాలంలో ఏపీకి కేంద్ర పన్నుల్లో రూ. 2,34,113 కోట్లు వస్తాయి. అంటే… ఏటా రూ. 50వేల కోట్ల కంటే తక్కువ. అయితే తెలంగాణ కంటే చాలా ఎక్కువే. వచ్చే ఐదేళ్లలో తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వాటా రూ.1,09,786 కోట్లు మాత్రమే. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41శాతం పంపిణీ చేస్తున్నారు.

బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం నుంచి ఇరవై రెండు మంది ఎంపీల్ని గెలుచుకున్న వైసీపీ పక్ష నేత విజయసాయిరెడ్డి… ఇది ఎన్నికలున్న రాష్ట్రాలకు చెందిన బడ్జెట్‌గా చెప్పుకొచ్చారు. మరి ఏపీ సంగతేమిటి..? అంటే ఆయనకూ క్లూ లేదు. బహుశా.. ఏపీలో జరిగే ఎన్నికల ఏడాది బడ్జెట్‌లో ఓ లక్ష కోట్లు ప్రకటిస్తారు కావొచ్చు. ఎన్నికలైన తర్వాత ఇస్తారో లేదో తర్వాత సంగతి..! ప్రజలు ప్రశ్నించడం ఎప్పుడు మానేశారో.. అప్పుడే వీటన్నింటినీ ఆమోద ముద్ర ఉందని.. ప్రభుత్వాలు అనుకుంటూ వస్తున్నాయి. అదే చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close