ఎన్టీఆర్ బ‌యోపిక్‌: కృష్ణ‌, శోభ‌న్‌బాబు లేన‌ట్టే

ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే… ఓత‌రం తెలుగు సినిమా చ‌రిత్ర అనుకోవాలి. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ వైపు యావ‌త్ భార‌త‌దేశం చూసేలా చేశారు ఎన్టీఆర్‌. అటు పౌరాణిక, ఇటు జాన‌ప‌దం, సాంఘికం.. ఇలా ఎలాంటి క‌థ‌లోనైనా ఎన్టీఆర్ విజృంభించేసేవారు. ఆయ‌న స‌మ‌కాలికుల‌తోనూ చ‌క్క‌టి అనుబంధం ఉండేది. ముఖ్యంగా ఏఎన్నార్‌ని సోద‌రుడిలా భావించేవారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఏఎన్నార్ పాత్ర‌కు స‌ముచిత స్థానం ఉంది. అయితే ఆ త‌రువాతి త‌రం నుంచి వ‌చ్చిన కృష్ణ‌, శోభ‌న్ బాబుల పాత్ర‌ల‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో చోటు ద‌క్క‌లేదు. స్క్రిప్టు ద‌శ‌లో వీరిద్ద‌రి పాత్ర‌లూ ఉన్నా…. స‌రైన నటీన‌టులు దొర‌క్క ఆ పాత్ర‌ల‌న్ని హైడ్ చేసిన‌ట్టు స‌మాచారం. కృష్ణ పాత్రో మ‌హేష్‌బాబు క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. బాల‌య్య కూడా మ‌హేష్ తో ఈ పాత్ర‌ని చేయించాల‌నుకున్నారు. కానీ…మ‌హేష్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స్పంద‌న రాలేదు. దాంతో కృష్ణ పాత్ర లేకుండానే `ఎన్టీఆర్` బ‌యోపిక్ ముగియ‌నుంది. మ‌రోవైపు శోభ‌న్ బాబు పాత్ర కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క‌నిపించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. కృష్ణ‌తో పోలిస్తే… ఎన్టీఆర్ కెరీర్‌లో శోభ‌న్ బాబు పాత్ర చాలా త‌క్కువ‌. కృష్ణ పాత్రే లేన‌ప్పుడు ఇక శోభ‌న్ బాబు పాత్ర‌నిచూపించ‌డంలో అర్థం లేదు. అందుకే… శోభ‌న్ బాబు పాత్ర కూడా హైడ్ చేశారు. సూరేకాంతం, కృష్ణంరాజు, మోహ‌న్‌బాబు… ఇలా కొన్ని పాత్ర‌లు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రుగున ప‌డిపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close