నామినేషన్లు వేస్తారా ? వేసి సైడైపోతారా ?

బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. ఉన్న వారిలో కాస్త బలమైన వారు అనుకున్న వారిని ఎంపిక చేస్తే.. వారు ఊగిసలాడుతున్నారు. మొత్తం పదిహేడు స్థానాల్లో హైదరాబాద్ సీటుకు పోటీ పెట్టినా పెట్టకపోయినా ఎవరూ పట్టించుకోరు. మిగిలిన పదహారు స్థానాల్లో అతి కష్టం మీద ముగ్గురు సిట్టింగ్‌లకు చాన్సిచ్చారు. కుటుంబసభ్యుడు లాంటి బోయినపల్లి వినోద్ కుమార్‌కు కరీంనగర్ సీటిచ్చారు. మిగిలిన అభ్యర్థులంతా .. పోటీ ఇస్తారా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి.

సిట్టింగ్ ఎంపీలపైనా రూమర్స్ వస్తూండటం బీఆర్ఎస్ పార్టీని ఆందోళన పరిచేదే. నామా నాగేశ్వరరావు పేరు చాలా కాలంగా జంపింగ్‌ల జాబితాలో తిరుగుతోంది. తాజాగా మహబూబాబాద్ అభ్యర్థి కవిత పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆమె వెంటనే ఖండించారు. కానీ పరిస్థితి చూస్తే.. ఎవర్నీ నమ్మలేని రాజకీయం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో అత్యధికం ఇంత వరకూ ప్రచారం కూడా ప్రారంభించలేదు. పార్టీ క్యాడర్ గందరగోళంలో ఉండటంతో కదలడం లేదు.

కొంత మంది అభ్యర్థులు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. నామినేషన్ ఉపసంహరించుకోవడమో.. లేకపోతే .. మొక్కుబడిగా పోటీలో ఉండటమో చేస్తారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం వరంగల్ అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ముందు ముందు మరో మూడు , నాలుగు సీట్లకు కొత్త అభ్యర్థుల్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే .. మానసికంగా రెడీ అయిపోతున్నారు. నామినేషన్లు వేయకపోయినా.. వేసిన తర్వాత సైడైపోయినా ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్న నియోజకవర్గాలే లేవు. చివరికి మెదక్ విషయంలోనూ గందరగోళంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఆధిక్యత చూపించిన చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ వంటి చోట్ల కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే ముందు ముందు ఎలాంటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఊహించడం కష్టమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close