ఇన్‌సైడ్ టాక్‌: ఎన్టీఆర్ సెట్లో బాల‌య్య ఉగ్ర‌రూపం

నంద‌మూరి బాల‌కృష్ణ ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడో చెప్ప‌డం క‌ష్టం. బాల‌య్య మూడ్‌ని అభిమానులే అర్థం చేసుకోలేరు. సెట్లో కూడా ఆయ‌న శివ‌ తాండ‌వం ఆడేస్తుంటారు. ‘జై సింహా’ స‌మ‌యంలో మేక‌ప్ మేన్‌ని బాల‌య్య దూషించిన విష‌యం మీడియా సాక్షిగా బ‌య‌ట‌ప‌డిపోయింది. త‌న స‌భ‌ల‌లో అభిమానుల‌కు ఇచ్చే లెంప‌కాయ‌ల‌కు లెక్కే లేదు. ఇప్పుడు ‘ఎన్టీఆర్‌’ సెట్లోనూ బాల‌య్య ఉగ్ర‌రూపం చూపిస్తున్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. బాల‌య్య ధాటికి రోజుకి ఒక్క‌రు బ‌లైపోతున్నార‌ని, ప్ర‌తీ రోజూ.. ఎవ‌రో ఒక‌రు బాల‌య్య కోపానికి గుర‌వుతున్నార‌ని తెలుస్తోంది. అప్పుడ‌ప్పుడూ సెట్లో బాల‌య్య చిరు బురులాడ‌డం మామూలే. కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ లేద‌ని, బాల‌య్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేక‌పోతున్నామ‌ని ఈ సినిమాకి ప‌నిచేసిన కొంత‌మంది బ‌య‌ట గుస‌గుస‌లాడుకుంటున్నారు. బాల‌య్య వ‌చ్చి ప్ర‌శాంతంగా షూటింగ్ చేసుకుని వెళ్లిపోయిన రోజులు వేళ్ల పై లెక్క పెట్ట‌వ‌చ్చ‌ని ఈ సినిమాకి ప‌నిచేసిన‌వాళ్లే చెబుతుంటే.. ప‌రిస్థితిని అర్థం చేసుకోవొచ్చు.

‘ఎన్టీఆర్’ చిత్రానికి బాల‌య్య నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక పార్ట్‌గా రావాల్సిన ఈ సినిమా రెండు భాగాలుగా వ‌స్తోంది. ఓ వైపు ఎన్నిక‌లు, మ‌రోవైపు సినిమా షూటింగ్‌. దానికి తోడు… తండ్రి క‌థ‌ని తెర‌పైకి తీసుకొచ్చే అపూర్వ బాధ్య‌త‌. ఇవ‌న్నీ బాల‌య్య‌పై ఒత్తిడి పెంచుతున్నాయ‌ని, అందుకే బాల‌య్య అప్పుడ‌ప్పుడూ సెట్లో బాలెన్స్ త‌ప్పుతున్నాడ‌న్న టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close