దేవ‌ర‌.. ఫ‌స్ట్ లుక్ ఇదిగో!

ఎన్టీఆర్‌, కొర‌టాల కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రానికి ‘దేవ‌ర‌’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫ‌స్ట్ లుక్ సైతం విడుద ల‌చేశారు. స‌ముద్రం ఒడ్డున, చేతిలో ఆయుధంతో వీరోచితంగా ఎవ‌రి కోస‌మో ఎదురు చూస్తున్న ‘దేవ‌ర‌’గా ఎన్టీఆర్ లుక్ రివీల్ చేశారు. ఈ లుక్ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంది. లుక్‌తో పాటుగా రిలీజ్ డేట్ కూడా ఖ‌రారు చేశారు. వ‌చ్చే యేడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. మ‌రో క‌థానాయిక‌కీ క‌థ‌లో చోటుంది. ఆమె ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తుంది.

* టైటిల్ త్యాగం చేసిన బండ్ల గ‌ణేష్‌

ఎన్టీఆర్ సినిమాకి ‘దేవ‌ర‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన నేప‌థ్యంలో ట్విట్ట‌ర్‌లో బండ్ల గ‌ణేష్ ఆసక్తిక‌ర‌మైన కామెంట్లు చేశాడు. ఈ టైటిల్ త‌న‌దే అని, రెన్యువ‌ల్ చేయించుకోవ‌డం మ‌ర్చిపోవ‌డం వ‌ల్ల కొట్టేశార‌ని వ్యాఖ్యానించాడు. అయితే ఆ త‌ర‌వాత ఈ టైటిల్ ఎన్టీఆర్ కే వెళ్లిందని, ఎన్టీఆర్ కూడా త‌న హీరోనే కాబ‌ట్టి ఫ‌ర్వాలేద‌ని మ‌రో ట్విట్ చేశాడు గ‌ణేష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close