అచ్చెన్నకు ఒకలా.. వైసీపీ ఎమ్మెల్యేకు మరోలా..! చట్టం చుట్టమే..!

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని బెదిరించారని కేసు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు దాదాపుగా పదిహేను సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన వెంటనే స్టేషన్ బెయిల్ రాకుండా.. పై కోర్టుకు వెళ్లేందుకు సమయం పట్టేలా సెక్షన్లు పెట్టారు. అక్కడా బెయిల్ ఆలస్యమయ్యేలా రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. మరి ఆయనపై పెట్టిన కేసులో ఆయనేం చేశారు..? . బెదిరించారంటూ మాట్లాడిన ఆడియో టేప్‌ను విస్తృతంగా సర్క్యూలేట్ చేశారు. అది విన్నవారు.. దాన్ని బెదిరింపులా అని ఆశ్చర్యపోయారు. దానికే అరెస్ట్ చేస్తారా అని కూడా అవాక్కయ్యారు.

ఇప్పుడు విశాఖ జిల్లా వైసీపీ నేత, యలమంచిలి ఎమ్మెల్యే కూడా ఇలా బెదిరిస్తున్న ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన నేరుగా సంగతి చూస్తానన్నారు. ఇళ్లు కూలగొడతానన్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నేరుగా వెళ్లి ఆడియో రికార్డులతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రెండు రోజుల తర్వాత పోలీసులు కదిలారు. మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో.. ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేశారు. ఆ పెట్టిన కేసులు.. ఐపీసీ 506, 171(F)తో పాటుగా పంచాయతీరాజ్ చట్టం కింద కేసు పెట్టారు. అంటే… బెయిలబుల్ కేసులన్నమాట. కనీసం పోలీసులు నోటీసులు కూడా జారీ చేయరు.

అంటే అచ్చెన్నాయుడు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేసినా బెదిరించారని చెప్పి కేసులు పెట్టేసి.. అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేసేసిన పోలీసులు… యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఆ దూకుడు చూపించలేదు. నిజంగా బెదిరించి… అంతు చూస్తానని హెచ్చరించిన ఎమ్మెల్యేపై సాధారణ కేసులు అదీ కూడా మీడియాలో హైలెట్ అయితేనే నమోదు చేశారు. ఏపీలో చట్టం… ప్రతిపక్ష నేతలకు ఓకలా.. అధికార పక్షం నేతలకు మరోలా పని చేస్తోందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని..విపక్ష నేతలు అంటున్నారు. పోలీసులు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని కొంత కాలంగా విపక్షాలు చేస్తున్న విమర్శలు ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో మరింత బలంగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close