ఏపీలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు..! హైకోర్టు ఆదేశం..!!

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లో నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు.. ఏపీ విషయంలోనూ అదే తరహా తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా ప్రభుత్వం జీవో 90ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టు 1వ తేదీకి ముగిసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. చూస్తే.. తెలంగాణలో ఎన్నికలయిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఏపీలో మాత్రం..ముందుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 12,888 గ్రామ పంచాయతీలకు 1,30,870 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గత ఏడాది నవంబరు నుంచీ సన్నాహాలు చేసింది.

కానీ వైపు ఓటర్ల జాబితా ఖరారు కాకపోవడం, బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టు ఉత్తర్వులతో ఎన్నికల వాయిదా అనివార్యమైంది. రిజర్వేషన్లు 50శాతానికి మించ కూడదని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం కొత్త కసరత్తు మొదలు పెట్టింది. దాంతో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలు ఇక వీలైనంత త్వరలో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మాయావ‌న్’ టీజ‌ర్‌: సూప‌ర్ హీరో Vs సామాన్యుడు

https://youtu.be/jQ5f_tGienU దుష్ట‌శ‌క్తికీ, సామాన్యుడికీ పోరు ఎప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటుంది. దానికి సైన్స్‌, దైవ శ‌క్తి తోడైతే ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌ల విడుద‌లైన 'హ‌నుమాన్‌' ఈ జోన‌ర్ క‌థే. ఇప్పుడు సందీప్ కిష‌న్...

గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ – బీజేపీ కౌంటర్ ఫలిస్తుందా..?

తెలంగాణకు పదేళ్లలో బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్ కు కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది బీజేపీ. అరవై ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఇచ్చింది వంకాయ....

సింగిల్ పీస్… సాయి పల్లవి

'భానుమతి ఒక్కటే పీస్... హైబ్రిడ్ పిల్ల' ఫిదా సినిమాలో సాయి పల్లవి చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ సాయి పల్లవి నట, వ్యక్తిగత జీవితానికి సరిగ్గా సరితూగుతుంది. సాయి పల్లవి ప్రయాణం...

ఆ బటన్లు నొక్కిన డబ్బులు రానట్లే – ఓటర్లకు మస్కా !

జనవరి నుంచి ఊరూరా వెళ్లి ఉత్తుత్తి బటన్లు నొక్కిన జగన్ రెడ్డి ఇప్పుడు పోలింగ్ రోజు వారి ఖాతాల్లో డబ్బులేసి ఓట్లు దండుకోవాలనుకున్నారు. ఈసీని మ్యానేజ్ చేసుకోవచ్చనుకున్నారు. అందుకే వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close