నిఖిల్ కష్టాన్ని పవన్ గుర్తించాడు

హ్యాపీడేస్ సినిమాలో రాజేష్ తో ప్రేక్షకులకు దగ్గరైన నిఖిల్ ఆ తర్వాత హీరోగా కూడా మంచి సినిమాలు చేసి అలరించాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ జోష్ మీదున్న నిఖిల్ మరో రెండు రోజుల్లో శంకరాభరణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే కోనా సిఫార్సుతో ఈ సినిమా టీజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ విడుదల సమయంలో పవన్ నిఖిల్ తో అన్న మాటలు ఇప్పటివరకు ఎక్కడ ప్రస్థావించని నిఖిల్ సినిమా ప్రచారంలో బయటపెట్టేశాడు.

సినిమా మొదటి పోస్టర్ చూసి నచ్చిన పవన్ కళ్యాన్ కోనా వెంకట్ అభ్యర్దన మేరకు శంకరాభరణం టీజర్ విడుదల చేశాడు. ఆ సమయంలో టీజర్ చూసిన పవన్ నిఖిల్ గురించి బాడీ బాగా పెంచావోయ్.. కష్టపడ్డట్టు ఉన్నావ్ అని ప్రశంసించాడట. తన అభిమాన నటుడు తన కష్టాన్ని గుర్తించాడని ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు నిఖిల్. కోనా వెంకట్ నిర్మాణ సారధ్యంలో వస్తున్న శంకరాభరణం ఉదయ నందనవనం దర్శకత్వం వహించాడు.

మరి నిఖిల్ కష్టాన్ని పవన్ గుర్తించినట్టుగానే ప్రేక్షకులు కూడా గుర్తించి సినిమాను హిట్ చేస్తారనే ఆశిస్తున్నాడు నిఖిల్. నందిత హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అంజలి ఓ ప్రధాన పాత్రలో కనిపించి అలరించనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close