ఆ హీరోయినే కావాలంటున్న ప‌వ‌ర్‌స్టార్‌

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని మ‌రో సినిమాతో భ‌ర్తీ చేయాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించుకొన్నాడు. అందుకే ఎస్‌.జె.సూర్య సినిమాని ఆఘ‌మేఘాల మీద ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఈ సినిమాకీ నిర్మాత‌ శ‌ర‌త్ మ‌రార్ నే. వీలైనంత త‌క్కువ బ‌డ్జెట్‌లో ఈ సినిమాని పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. అందుకే భారీ స్టార్ కాస్టింగ్ జోలికి వెళ్ల‌డం లేదు. పారితోషికం కోసం స‌తాయించే వాళ్ల‌ని తీసుకోకండి అని ప‌వ‌న్ స్ట్రాంగ్‌గా చెప్పేశాడ‌ట‌. సినిమాని త‌క్కువ‌లో తీయ‌మంటే ఏ నిర్మాత‌కైనా హ్యాపీనే క‌దా, దాంతో శ‌ర‌త్ సంబ‌ర‌ప‌డ్డాడు. అయితే అంత‌లోనే ప‌వ‌న్ ఓ ట్విస్టు ఇచ్చాడు.

మిగిలిన‌వాళ్ల‌మాటేమో గానీ, క‌థానాయిక విష‌యంలో రాజీ ప‌డ్డొద్దంటున్నాడ‌ట ప‌వ‌న్‌. ఈ సినిమాలోనూ అగ్ర క‌థానాయికే ఉండాల‌ని కండీష‌న్ పెట్టాడ‌ట‌. దాంతో కొత్త‌మ్మాయితో స‌ర్దుకుపోదామ‌న్న శ‌ర‌త్‌కి మోకాల‌డ్డిన‌ట్టు అయ్యింది. పైగా.. ప‌వ‌న్ మ‌న‌సులో శ్రుతిహాస‌న్ మెదిలింద‌ట‌. గ‌బ్బ‌ర్ సింగ్‌తో త‌న‌కు జోడీగా న‌టించింది శ్రుతి. ఆ సినిమా సంద‌ర్భంలో శ్రుతి చూపించిన క‌మిట్‌మెంట్ ప‌వ‌న్‌కి న‌చ్చింద‌ట‌. అందుకే మ‌రోసారి శ్రుతి పేరు ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. ప‌వ‌న్ అడిగితే నో చెప్పేదేముంది? అందుకే శ‌ర‌త్ మ‌రార్ ఇప్పుడు శ్రుతి డేట్లు ప‌ట్టుకొనే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అటు వైపు నుంచి శ్రుతి కూడా ఓకే అంటే గ‌బ్బ‌ర్ కాంబినేష‌న్ మ‌ళ్లీ సెట్ట‌యిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

లెట్స్ ఓట్ : బానిసలుగా ఉంటారా ? పాలకులుగానా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ఓట్లేసే మనమే పాలకులం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించే మన ప్రతినిధులు అంటే.. మనం ఎన్నుకున్న పాలకులు.. తామే మహారాజులం అన్నట్లుగా పెత్తనం చేస్తారు. ఓ మాట...

HOT NEWS

css.php
[X] Close
[X] Close