ఇమేజ్ రీ బిల్డింగ్‌లో పవన్ కల్యాణ్‌..!!

సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవాలంటే.. ఇమేజ్ ఎంతో ముఖ్యం. అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే హీరోలు.. తమ బ్యాక్ గ్రౌండ్, బాడీ లాంగ్వేజ్ లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కథలు ఎంచుకుని.. ఆయా విభాగాల్లో హీరోలుగా చెలామణి అవుతూంటారు. ఎప్పుడైనా మార్పు కోసం ప్రయత్నిస్తే..ఎదురు దెబ్బలు తగులుతూంటాయి. రాజకీయాలు కూడా దీనికి భిన‌్నమేం కాదు. కానీ సినిమాల్లోలా ఇమేజ్‌కు భిన్నంగా ఓ సారి ప్రయత్నం చేసి…దెబ్బతింటే.. మళ్లీ .. పాత ఇమేజ్ తెచ్చుకోవడం అంత తేలిక కాదు. ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా మారిన పవన్ కల్యాణ్ పరిస్థితి అదే.

తెలుగు సినిమాల్లో తెలుగువారికే అవకాశం ఇవ్వాలంటూ.. శ్రీరెడ్డి అనే నటీమణి ప్రారంభించిన ఉద్యమం.. అటూ ఇటూ తిరిగి వపన్ కల్యాణ్‌ వద్దకు చేరింది. దీన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయిన పవర్ స్టార్.. చేతికి అంటిన దాన్ని ముక్కుకు అంటించుకున్న చందంలా… అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. చివరికి ఆ వివాదం.. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ వేరు అన్న ముద్ర పడటంతో పాటు.. తనలోని అపరిచితుడ్ని బయటకు వచ్చేలా చేసింది. మీడియా సంస్థలపై, వాటి యజమానులపై.. అభ్యంతరకర ట్వీట్లతో సాధారణ పవన్ కల్యాణ‌్ కన్నా.. దారుణంగా… పవన్ ఉంటారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో తనే కల్పించారు.

ఓ రాజకీయ పార్టీ అధినేత ఎవరు విమర్శించినా హుందాగా స్పందించే లక్షణం పవన్ కు ఉండాలి. కానీ ఆవేశంలో ఆయన సగటు కుర్రాడిలా ప్రవర్తించారు. వ్యక్తిగత విమర్శలతో ట్వీట్లు చేశారు. మీడియా సంస్థల కుటుంబసభ్యుల ఫోటోలతో ట్వీట్లు చేశారు. వారిపై దాడులు చేయాలనేలా అభిమానులను రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు… అసలు టీవీల్లో ప్రసారమే చేయని వీడియోను.. మార్ఫింగ్ చేయించి మరీ.. తనే ట్విట్టర్ లో పెట్టి మరింత ప్రచారం కల్పించారు. తల్లిని సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి. దాంతో పవన్ కల్యాణ్ నాలుగు రోజులుగా సైలెంట్ అయ్యారు.

గుంటూరు , చిత్తూరు జిల్లాల్లో పర్యటనలు ఉన్నా.. పవన్ కల్యాణ్ వాయిదా వేసుకున్నారు. దానికి ఏ కారణం చెప్పినా.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వచ్చే మూడ్ లో లేరు. అందుకే ఆయన పుస్తకాలను చదవుకుంటున్నారు. తనకు నచ్చిన అంశాలను ట్విట్టర్ లో పెడుతున్నారు. కొన్ని పుస్తకాలను చదవాలని ఫ్యాన్స్‌కు సలహా ఇస్తున్నారు. అర్థం, పర్థం లేని ట్వీట్ల వల్ల పోయిన ఇమేజ్ ను .. ఇప్పుడు అదే ట్వీట్ల ద్వారా పవన్ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. రాజకీయాల్లో అదంతా సులువేం కాదు. పవన్ సాధిస్తారేమో చూడాలి..!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close