అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు : పవన్ కల్యాణ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ”అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విషయంలో సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారన్నారు. రాష్ట్రాన్ని అధోగతిపాల్జేస్తున్న తీరుకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారని.. . ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు అన్న పవన్‌.. ఈ ఫలితాలు వైకాపా ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వైసీపీది ప్రజా కంటక పాలన అని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలో రాకుండా ఉండటానికి చేయాల్సినదంతా చేస్తామని ప్రకటించారు. ఓట్లు చీలనివ్వబోమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనానికి వైసీపీకి తప్ప ఎవరికైనా ఓటేయమని పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close