రేవంత్ కి ప‌య్యావుల ఇచ్చిన స‌మాధానం ఇదేనా..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆంధ్రా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి రాజేసిన రాజ‌కీయ చిచ్చు తెలుగుదేశం పార్టీలో ఇంకా చ‌ల్లార‌లేదు. అనంత‌పురంలో జ‌రిగిన ప‌రిటాల శ్రీ‌రామ్ పెళ్లికి కేసీఆర్ రావ‌డం, టీడీపీ నేత ప‌య్యావుల కేశ‌వ్ ను ప‌క్క‌కు పిల‌వ‌డం, ర‌హ‌స్యంగా కాసేపు మాట్లాడ‌టం.. ఈ ప‌రిణామాల‌పై టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. చిర‌కాల మిత్రుడైన ప‌య్యావుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలోనే అసంతృప్తి వేశారు. ప‌య్యావుల‌కు తెలంగాణ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉంటే, ఇక్క‌డికి వ‌చ్చి తెరాస‌లో చేరొచ్చ‌ని కూడా అనేశారు. ఈ మొత్తం ప‌రిణామాల‌పై తాజాగా ప‌య్యావుల కేశ‌వ్ పార్టీ నేతల ముందు మాట్లాడినట్టు సమాచారం. కేసీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌న వైఖ‌రిని త‌ప్పుబ‌ట్ట‌డ‌మేంట‌ని ఆయ‌న కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారట.

కేసీఆర్ అనంత‌పురానికి వ‌చ్చిన‌ప్పుడు ఇత‌ర టీడీపీ నేత‌లతో కూడా సఖ్యంగా ఉన్నార‌నీ, తాను కూడా అలానే వ్య‌వ‌హ‌రించాను అని ప‌య్యావుల చెప్పారట. ప‌రిటాల ఇంట పెళ్లికి తానూ ఒక అతిథిగానే వ‌చ్చాన‌నీ, కేసీఆర్ ఎదురుగా క‌నిపించ‌గానే మ‌ర్యాద‌పూర్వకంగా అభివాదం చేశాన‌ని అన్నారు. ఆ త‌రువాత‌, త‌న‌దారిన తాను వెళ్లిపోతుంటే ఓ పోలీసు అధికారితో కేసీఆర్ క‌బురు పెట్టార‌నీ, ముఖ్య‌మంత్రి స్థాయి నాయ‌కుడు పిలుస్తుంటే వెళ్ల‌క‌పోతే బాగోద‌ని తిరిగి వెళ్లాను అని చెప్పారు. ఇందుతో త‌న త‌ప్పు ఏముంద‌ని ప‌య్యావుల‌ వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేసినట్టు సమాచారం. రెండు నిమిషాలు మాట్లాడిన దానికి ఇంత తీవ్రంగా స్పందించాలా, తెలంగాణ‌లో పార్టీ నాయ‌కులు రాజీనామాలు చేస్తారు అనేలా మాట్లాడాలా అంటూ ప‌య్యావుల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రికి స‌రైన స‌మాచారం అందక‌పోవ‌డం వ‌ల్ల‌నే త‌న‌ను త‌ప్పుబ‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ‘కేసీర్ తో భేటీ ఎందుకూ, సీనియ‌ర్ నేత‌లే ఇలా చేస్తే ఎలా..? తెలంగాణ‌లో మ‌న పార్టీ ఏమౌతుందీ’ అంటూ కొంద‌రు వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని కూడా ప‌య్యావు నేతల ముందు వ్యాఖ్యానించారట.

ప‌య్యావుల కేశ‌వ్ త‌న‌కు తానుగా కేసీఆర్ తో ర‌హ‌స్య మంత‌నాలు జ‌ర‌ప‌లేదు. కానీ, ఈ ఘ‌ట‌న తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయంగా మారింది. టీడీపీ, తెరాస‌ల మ‌ధ్య పొత్తు ఉంటుంద‌నే స్థాయిలో క‌థ‌నాలు వ‌చ్చేశాయి. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి స్పందించి… ప‌య్యావుల‌పై కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. గ‌డ‌చిన వారం రోజులుగా ఇదే చర్చ వాడీవేడీగా జ‌రుగుతోంది. మీడియాలో కూడా ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కానీ, ఇంత‌వ‌ర‌కూ ప‌య్యావుల స్పందించ‌లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ప‌య్యావుల వివ‌ర‌ణ ఎలా ఉందంటే.. రేవంత్ రెడ్డికి ఇచ్చిన స‌మాధానంగా అనిపిస్తోంది. ఇదే వివ‌ర‌ణ ఓ నాలుగైదు రోజులు కింద‌టే ఇచ్చి ఉంటే.. తెలంగాణ‌లో ఈ భేటీపై చ‌ర్చ ఉండేది కాదు. రేవంత్ కూడా అంత ఆవేద‌న చెందేవారు కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తనను తప్పుపట్టే విధంగా మాట్లాడేవారు కాదు కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close