ఓటీటీలోనే ‘పెళ్లి సంద‌డి’?

థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌… ఓటీటీ వేదిక‌లు కీల‌క‌మైన ప్ర‌త్యామ్నాయ మార్గాలుగా మారిపోయాయి. చిన్న‌, మీడియం సైజు సినిమాలు మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ బాట ప‌డుతున్నాయి. ఈవారంలో `ఏక్ మినీ క‌థ‌` అమేజాన్ లో విడుద‌ల అవుతోంది. ఇప్పుడు మ‌రో సినిమాకి ఓటీటీ నుంచి క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని స‌మాచారం.

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. గౌరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. ఈ సినిమాకి అమేజాన్‌, ఆహాల నుంచి క్రేజీ ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ట్టు టాక్‌. రూపాయికి రూపాయి లాభం వ‌చ్చేలా… ఈ ఆఫ‌ర్లు ఉన్నాయ‌ని, ఎప్పుడైనా ఈ డీల్ ఓకే అయిపోవొచ్చ‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు వ‌ర‌కూ థియేట‌ర్లు తెర‌చుకునే ఛాన్స్ లేదు. అప్ప‌టి వ‌ర‌కూ చిన్న సినిమాల్ని కాపు కాయ‌డం క‌ష్ట‌మే. ఓర‌కంగా.. పెళ్లిసంద‌డికి ఇది మంచి ఆఫ‌ర్ కిందే లెక్క. మ‌రి రాఘ‌వేంద్ర‌రావు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close