తెగేదాకా లాక్కుంటున్న పేర్ని నాని – ప్లానేనా ?

ఏలూరు కలెక్టర్‌తో వివాదం పెట్టుకున్న పేర్ని నాని తెగేదాకా లాక్కుంటున్నారన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాలేదని ..సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించిన ఆయన… ఈ సారి అదే మాటను.. సచివాలయంలో చెప్పారు. ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌పై ఫిర్యాదు చేసేందుకు పేర్ని నాని సెక్రటేరియట్‌కు వచ్చారు. సీఎస్‌తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏలూరు కలెక్టర్ తీరును విమర్శించడంతో పాటు.. మరోసారి జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తానని ప్రకటించారు.

పేర్ని నాని ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఏలూరు ఎమ్మెల్యే ప్రసన్న వెంకటేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. పేర్ని నాని తీరుపై ఆయన సీఎంవోలో ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ వెళ్లాల్సిన పని లేదని ఆయన చెబుతున్నారు. మామూలుగా అయితే.. అధికారులు సీఎస్ వద్దకు.. రాజకీయ నేతలు క్యాంప్ ఆఫీసుకు రావాలి.కానీ ఇక్కడ భిన్నంగా మాజీ మంత్రి సీఎస్ వద్దకు వెళ్తే.. ఐఏఎస్ ఆఫీసర్ ప్రసన్న వెంకటేష్ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు.

దీంతో ఈ ఇద్దరి మధ్య అసలు వివాదం కాకుండా కొసరు వివాదం కూడా ఏదో ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సీఎం కూడా పట్టించుకోనందుకే.. తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచేందుకు సీఎం ఇంటి ముందు ధర్నా అంటున్నారని చెబుతున్నారు. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో కానీ పేర్ని నాని తెగేదాకా లాక్కుంటున్నారన్న అభిప్రాయానికి వైసీపీ వర్గాలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close