రాజమౌళికి ఓ రేటు.. మరోకరికి మరో రేటు ఉండదు : పేర్ని నాని

ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవడం… అదనపు షోలు..బెనిఫిట్ షోల కోసం సీఎ జగన్‌ను కలిసిన రాజమౌళికి పేర్ని నాని.. ఛత్రపతి డైలాగ్‌తో అవమానించి పంపేసారు. జగన్‌తో రాజమౌళి భేటీ ముగిసిన రాజమౌళికి ఓ రేటు.. ఇతరులకు మరో రేటు ఉండదని.. మీడియా ముందు చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా అదనపు షోలు, టిక్కెట్ రేట్ల పెంపు కోసం రాజమౌళి, నిర్మాత దానయ్య ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. దాదాపుగాగంట సేపు సమావేశమయ్యారు. తర్వాత ఎయిర్‌పోర్టులో మాట్లాడిన రాజమౌళి సీఎం జగన్ బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అంతే కానీ.. అదనపు షోలు..టిక్కెట్ రేట్ల పెంపు.. ఇతర అంశాలపై ఆయన స్పందించలేదు. అయితే కాసేపటికే మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. టిక్కెట్ ధరలు ప్రభుత్వం నిర్ణయించినట్లే ఉంటాయని స్పష్టం చేశారు.

ఐదు షోలకు పర్మిషన్ ఉందికానీ ఓ షో చిన్న సినిమా వేయాల్సిందేనన్నారు. బెనిఫిట్ షోలకు అనుమతి లేదన్నారు. రాజమౌళి… దానయ్య జీవోలపై కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చారని తేల్చేశారు. చివరికి జగన్ – రాజమౌళి మధ్య జరిగిన సమావేశంలో తాను లేనని క్లారిటీ ఇచ్చారు. మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకుఎక్కడా సమస్యలు లేవు కానీ ఏపీలో మాత్రం పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం వద్ద నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఐదో ఆటకు…అలాగే టిక్కెట్ రేట్ల పెంపు కోసం ప్రత్యేక అనుమతి కావాల్సి ఉంటుంది. వీటిపై చర్చేందుకు దానయ్య, రాజమౌళి సీఎం తో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని వీరినీ సీఎం వద్దకు తీసుకెళ్లారు.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌కు ఒక్క రోజు ముందు రూ. పాతిక పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రత్యేక షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇస్తారా లేదా అన్న టెన్షన్ ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు ఉంది. అలాగే టిక్కెట్ రేట్ల పెంపు రూ. పాతిక సరిపోదని.. భావిస్తున్నారు. దాదాపుగా 80, 90 శాతం ధియేటర్లలో ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది. క్కెట్ రేట్లను తాము అనుకున్నట్లుగా పెంచుకునేలా పర్మిషన్ ఇస్తే… కలెక్షన్లకు ఢోకా ఉండదని…లేకపోతే ఇబ్బంది అవుతుందని సినిమా యూనిట్ భావిస్తోంది. పేర్ని నాని మాటలను బట్టి చూస్తే.. వెళ్లి కలిసినా షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close