తప్పించుకునేందుకు హైకోర్టులో అగ్రిగోల్డ్ వింత పిటిషన్లు ..!

విచ్చలవిడిగా డిపాజిట్లు సేకరించి చెల్లించలేక చేతులెత్తేసిన అగ్రిగోల్డ్ సంస్థ.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు ఓ విచిత్రమైన ప్రతిపాదన సమర్పించింది. గత విచారణలో… చెల్లించాల్సిన వారితో వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకుంటామనే ప్రతిపాదన తీసుకు వచ్చి.. కోర్టు చేత చీవాట్లు తిన్న అగ్రిగోల్డ్ యాజమాన్యం తాజాగా… అలాంటిదే మరో ప్రతిపాదన హైకోర్టు ధర్మాసనం ముందు ఉంచింది. 15 నుంచి 60 నెలల్లో 23 ఆస్తులను జాయింట్ వెంచర్ ల ద్వారా అభివృద్ధి చేసి 2040 కోట్లు సమకూర్చుతామని.. అందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసింది. ఈ అంశంపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, కేంద్ర ఆర్థికశాఖ.. ఈడీ, బ్యాంకులు, పిటిషనర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

బ్యాంక్ లతో వన్ టైమ్ సెటిల్మెంట్ కు అవకాశం ఇవ్వాలని, అటాచ్ చేసిన ఆస్తులు తాము అమ్మేందుకు అవకాశం ఇవ్వాలని దాఖలు చేసిన మద్యంతర దరఖాస్తులను ఉపసంహరించుకోవడంతో వాటిని డిస్మిస్ చేసింది. అగ్రిగోల్డ్ కేసు విచారణ అమరావతి హైకోర్టుకు బదిలీ చేయాలని.. తెలంగాణ హైకోర్టును ఏపీ సర్కార్ కోరింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం తెలిపింది. అగ్రిగోల్డ్ వ్యవహారం ఏళ్ల తరబడి నలుగుతూనే ఉంది. అది రాజకీయ అంశం కూడా అయింది. టీడీపీ హయాంలో బాధితులకు న్యాయం జరగలేదని వైసీపీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే.. రూ. 1150 కోట్లు వెంటనే చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే.. ఏడాది దాటినా రూ. 300 కోట్లే చెల్లించగలిగారు.

ఇప్పుడు డిపాజిటర్ల ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో.. ఆస్తులన్నీ అమ్మేసి.. డిపాజిటర్లకు చెల్లింపులు చేయాల్సి ఉంది. అయితే అనూహ్యంగా… అగ్రిగోల్డ్.. తాము ఆస్తులను అభివృద్ధి చేసి విక్రయిస్తామని.. రెండు వేల కోట్లు కడతామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దాని కోసం ఏకంగా ఐదేళ్ల గడువు కోరడం కూడా.. ఆర్థిక నిపుణుల్ని కూడా విస్మయపరుస్తోంది. ఆస్తులను వేలం వేయకుండా.. అగ్రిగోల్డ్ యాజమాన్యం కొత్త కుట్రలు చేస్తోందన్న అనుమానాలను డిపాజిటర్లు వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close