పిఎంఒ ట్రాన్స్ ఫర్మేషన్ : సమర్ధతగా మారుతున్న శక్తి!

పిఎంఒ కి (ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ – ప్రధానమంత్రి కార్యాలయం) మించిన శక్తివంతమైన ఆఫీస్ భారతదేశంలో మరొకటిలేదు. ఇంత వరకూ అది వ్యక్తిగతంగా ప్రధానమంత్రి ఆజ్ఞలను అమలు చేసే సహాయక పాత్రకు మాత్రమే పరిమితమై వుండేది. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక శక్తివంతమైన పిఎంఒ, మంత్రివర్గం అంతటినీ సమన్వయ పరచగల సమర్ధ పాలక కేంద్రంగా రూపాంతరం చెందుతోంది.

శాఖలవారీగా మంత్రుల పనిని సమీక్షించడానికి ప్రధాని నిర్ణయించకున్న ఫార్మాట్ ను రూపొందించడంలో, ఆమేరకు వివరాలు తెప్పించకుని నివేదికలు వాటి సారాంశాలను సిద్ధం చేయడంలో అవిశ్రాంతంగా పని చేస్తున్న పిఎంఒ స్ధాయి ప్రధాని వ్యక్తిగత సహాయకత నుంచి గవర్నెన్స్ లో ఒక ”పవర్ పాయింట్” గా మారిపోతోంది.

కష్టపడి పని చేయటంతోపాటు మంత్రులు, అధికారుల చేత కూడా మోదీ పని చేయిస్తున్నారు. కేవలం అధికారులపై ఆధారపడి మంత్రులను గాలికి వదిలివేయకుండా ముందుకు సాగటం మోదీ పాలనా దక్షతకు ప్రత్యక్ష సాక్ష్యమే! ఆయన హెడ్ మాస్టర్‌గా వ్యవహరించటంతోపాటు అంతా తానై చేస్తున్నారు. మోదీ అంతా తానై చేయటంతోపాటు మంత్రులతో కూడా పని చేయించేందుకు ప్రయత్నించటంతోపాటు వారి పని తీరును కాలానుగుణంగా సమీక్షిస్తున్నారు.

మంత్రులతో సమావేశమయ్యేందుకు ముందు మోదీ పెద్ద ఎత్తున హోం వర్క్ చేశారు. ప్రతి మంత్రిత్వ శాఖ పని తీరుపై నివేదికలు తయారు చేయించుకున్నారు, బడ్జెట్‌లో ఆయా శాఖలకు కేటాయించిన నిధులు, పథకాల వివరాలతో కూడిన ఒక నివేదిక సిద్ధం చేసుకోవటంతోపాటు ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోని పథకాలు ఏ స్థాయిలో అమలు జరుగుతున్నాయనేది నిగ్గు తేల్చుకున్నారు. ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసుకున్న తరువాతనే మంత్రులతో సమీక్ష జరపటం గమనార్హం.

ఆయా మంత్రులు కూడా తమ పని తీరు, తమ శాఖ పని తీరుపై నివేదికలు సిద్ధం చేసుకుని సమీక్షా సమావేశంలో ప్రధాన మంత్రికి వివరిస్తున్నారు. మంత్రులు ఇచ్చిన నివేదికలోని వివరాలు ప్రధాన మంత్రి తమ నివేదికలోని ఫలితాలతో పోల్చుకుని నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా వాస్తవంగా జరుగుతున్నదేమిటి? అభివృద్ధి పథకాలు ఏ మేరకు అమలు జరుగుతున్నాయి? ప్రజలకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతోంది? ఆభజివృద్ధి ఫలాలు ఏ మేరకు వారికి చేరుతున్నాయి? అనేది ఒక అంచనా కు వస్తుంది.

నరేంద్ర మోదీ ప్రతి మంత్రిత్వ శాఖ పనితీరును సమీక్షించటంతోపాటు ఆయా మంత్రులు ఎంత సమర్థతతో పని చేస్తున్నారనేది తేల్చారు. ఆయన కొందరు మంత్రుల పని తీరును ప్రశంసిస్తే మరికొందరు మంత్రులకు చురకలు వేశారు. మంత్రులు మరింత సమర్థంగా పని చేయాలని స్పష్టంగా చెప్పటంతోపాటు కష్టపడి పని చేయకపోతే ఉద్వాసన తప్పదనేది కూడా స్పష్టంగా చెప్పటంలో మోదీ వెనకాడలేదు.

ఈ మొత్తం హోంవర్క్ అంతా పిఎంఒ చేస్తోంది. అన్ని శాఖలను పరుగులు పెట్టిస్తోంది!

గతంలో కొందరు ప్రధాన మంత్రులు తమ మంత్రుల పని తీరును సమీక్షించేందుకు ప్రయత్నించినా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు. తప్పులు చేయటమే కాదు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్న మంత్రులను తప్పు చేయవద్దు అన్న మాట కూడా అనలేకపోయారు.

మన్మోహన్ సింగ్ నాయకత్వంలో పది సంవత్సరాల పాటు సాగిన యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు. ప్రధాన మంత్రికి సైతం వారి శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు వీలుండేది కాదు. కొందరు మంత్రులైతే మన్మోహన్ సింగ్ నాయకత్వాన్ని ప్రశ్నించే స్తాయికి ఎదిగిపోవటం తెలిసిందే.యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్.డి.ఏ సంకీర్ణ ప్రభుత్వం ఎంతో సమర్థంగా పని చేస్తోంది.

ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం అంటే అసమర్థత, అవినీతికి ప్రతీకగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలకు ఇష్టానుసారం వచ్చే రోజులు పోయాయి. బయోమెట్రిక్ విధాన మూలంగా ఉద్యోగులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకతప్పటం లేదు. మోదీ మూలంగా మంత్రుల, ఉద్యోగుల్లోవచ్చిన సహేతుక మార్పు ఒక బెంచ్ మార్క్ గా వుండిపోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close