రాజీనామాల రాజకీయాలు : నాడు టీడీపీ – నేడు వైసీపీ ఉక్కిరిబిక్కిరి !

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం కేంద్రంగా రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి .. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ. ఇరవై వేల కోట్లు కావాలని కేంద్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేంద్రంపై యుద్ధం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పోలవరం కోసం వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీలతో పాటు సీఎం జగన్ కూడా రాజీనామా చేస్తే కేంద్రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎందుకివ్వదో చూద్దామని చంద్రబాబు అంటున్నారు.

గతంలో ప్రత్యేకహోదా కోసం రాజీనామాల డిమాండ్ వినిపించేది. ఇరవై ఐదు మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేకహోదా రాదో చూద్దామని జగన్ చెప్పేవారు. ఎంపీలతో రాజీనామా చేయించారు. కానీ ఆరు నెలలపదవీ కాలం ఉన్నప్పుడే రాజీనామాలు చేయించడంతో ఉపఎన్నికలు రాలేదు. ఇప్పుడు పోలవరం అంశంపై రాజీనామాల డిమాండ్ తెరపైకి వచ్చింది. టీడీపీ ఎంపీలు.. వైసీపీ ఎంపీలురాజీనామా చేస్తే తాము కూడా చేస్తామని అంటున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. వంద శాతం కేంద్రం భరించాలి. కానీ ఈ విషయంలో కేంద్రం అంత వేగంగా స్పందించడం లేదని ముఖ్యమంత్రే చెబుతున్నారు.

అప్పట్లోఎందుకు రాజీనామాలు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. అప్పట్లో టీడీపీ రాజీనామాలు చేయలేదు కాబట్టి ఓడిపోయారు.. ఇప్పుడు వైసీపీ చేయకపోయినా అదే పరిస్థితి వస్తుంది కదా అంటే వైసీపీ నేతల దగ్గర సమాధానం ఉండదు. ఇలాంటి డౌట్స్ వస్తే కొడాలి నాని వంటి వారిని రంగంలోకి దింపి.. టీడీపీ నేతల్ని బండ బూతులు తిట్టిస్తున్నారు. కానీ అది సమస్యకు పరిష్కారం కాదు. కనీసం రాజీనామాల చర్చను కూడా పక్కదోవ పట్టించుదు. కొడాలి నాని బూతులు ఇప్పుడు రొటీన్ అయిపోయాయి. మరి టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లుగా రాజీనామాల సవాళ్లను ముందుకు తీసుకెళ్తారా లేకపోతే… ఎదురుదాడి చేసి సర్దుకుంటారా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close