కృష్ణపట్నం కరోనా మందు చుట్టూ రాజకీయం..!

నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగే ఆనందయ్య వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అవడం.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూడంటంతో.. మొత్తం రాజకీయం అయిపోయింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన బొనిగె ఆనందయ్య ఆయుర్వేద వైద్యం చేస్తూంటారు. నిన్నామొన్నటిదాకా ఆయనకు పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. కానీ కరోనాకు చికిత్స చేయడం ప్రారంభించిన తర్వాత ఆయన పేరు మార్మోగిపోయింది. కృష్ణపట్నంలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆయన మందు తీసుకున్న ఎవరికీ కరోనా రాలేదు. దాంతో ఆయనకి నమ్మకం కుదిరి చుట్టుపక్కల గ్రామాల వారికి ఇచ్చారు. అందరూ బాగుందని, బాగా పనిచేస్తుందని చెప్పడంతో ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టారు..

ఆనంద్ కుమారులు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వారి నుంచి లక్ష రూపాయలు తీసుకుని మందు తయారు చేసి పంపిణీ చేయడం ఆరంభించారు. ఆ తరువాత మందు వాడి కరోనా తగ్గిన వారే….మందు తయారీకి సామగ్రి సమకూరుస్తున్నారు. గ్రామంలో యువకులు పలువురు వాలంటీర్లుగా పనిచేస్తూ సేవ చేస్తున్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా ఒక మందు… వచ్చిన వారికి తగ్గేందుకు మరో మందు… పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఇంకో మందు తయారు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతున్నారు.

ఈ మందు గురించి సామాజిక మాధ్యమాల్లో చూసిన తమిళనాడు, కేరళ ప్రాంతాలకి చెందిన పలువురు ఆయుర్వేద వైద్యులు సైతం…తయారీ విధానం తెలుసుకునేందుకు నెల్లూరు చేరుకున్నారు. పబ్లిసిటీ పెరగడంతో ఇతర రాష్ట్రాల వారూ వస్తున్నారు. దీంతో రాజకీయ కన్ను పడింది. ఇదేదో తేడాగా ఉందని లోకాయుక్త లక్ష్మణరెడ్డి విచారణకు ఆదేశించారు. పంపిణీని నిలిపివేయించారు. దీంతో అది రాజకీయ అంశం అయిపోయింది. ఆనందయ్యకు మద్దతుగా కొంత మంది .. వ్యతిరేకంగా కొంత మంది బయలుదేరారు. ప్రభుత్వ విచారణ కమిటీలు నియమించింది. సోషల్ మీడియాలో ఇదొక ట్రెండింగ్ టాపిక్ అయింది. అనేక పరిశోధనలు చేశారు. అయితే ఆ మందు వల్ల… సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని చెబుతున్నారు.

నిజానికి ఇలాంటి వైద్యాన్ని పక్ష వాదం దగ్గర్నుంచి అనేక రకాల వ్యాధులకు అందించే వారు చాలా మంది ఉన్నారు. నమ్మకంతో వెళ్తూ ఉంటారు. వైద్యానికి నమ్మకమే మొదటి పునాది. మరి ఈ ఆనందయ్య కరోనా వైద్యాన్ని నమ్ముతున్న వారిని ప్రభుత్వం.. ఏం చేస్తుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close