ఏపీకి రేపో మాపో కొత్త డీజీపీ !

ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి స్థాన చలనం తప్పేలా లేదు. మరో వారం రోజుల్లోనే ఆయనను డీజీపీ పదవి నుంచి తప్పించి ఇతరులను నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత రాజేంద్రనాథ్ రెడ్డి ఇంచార్జ్ హోదాలోనే ఉన్నారు. నిబంధనల ప్రకారం నియామకం జరగలేదు. అత్యవసరంగా డీజీపీని నియమించుకోవాల్సి ఉంటే… ఇంచార్జ్ గా నియమించుకోవచ్చు. కానీ వెంటనే డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లను డీవోపీటీకి పంపాలి. వారిలో ముగ్గురి పేర్లను ఫైనల్ చేసి .. పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్రం ఎంచుకోవచ్చు. రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపికలో ఈ ఫార్ములాను రాష్ట్రం పాటించలేదు. గౌతం సవాంగ్ ను అప్పటికప్పుడు పంపేసి.. రాజేంద్రనాథ్ రెడ్డికి సీటిచ్చారు.

ఇప్పుడు కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని కొనసాగించాలనుకుంటే… ప్రభుత్వానికి చాన్స్ ఉంది. కానీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవలి కాలంలో ప్రభుత్వం అనుకున్నట్లుగా పనితీరు చూపించలేకపోతున్నారని అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అందుకే.. సీఐడీ చీఫ్ గా .. మూడున్నరేళ్ల పాటు తమను మెప్పించేలా పని చేసిన సునీల్ కుమార్ ను డీజీపీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయనకు ఇటీవల డీజీ హోదా ఇచ్చారని చెబుతున్నారు. ఆయనతో పాటు పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా డీజీపీ పోస్టుకు పోటీ పడుతున్నారు. ఇంటలిజెన్స్ మొత్తం రాజకీయం కోసం వాడుతూ ఆయన ప్రభుత్వ పెద్దలకు ఇటీవల బాగా దగ్గరయ్యారని చెబుతున్నారు.

ఏపీ పోలీసు వ్యవస్థ పై ఏపీ ప్రజలు దాదాపుగా నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. సిన్సియర్ అధికారులందరూ లూప్ లైన్ లో ఉన్నారు. రాజకీయకక్ష సాధింపుల కోసమే పోలీసు వ్యవస్థ పని చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో.. ఇంకా ఏం కావాలని డీజీపీలను ప్రభుత్వం పదే పదే మారుస్తుందో కానీ.. ఈ వ్యవహారం మాత్రం అధికారుల్లోనూ నిర్వేదానికి కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close