ప్ర‌భాస్ – హ‌ను రాఘ‌వ‌పూడి.. వేరే సెట‌ప్‌

సీతారామంతో ఓ సూప‌ర్ హిట్ ఇచ్చిన హ‌ను రాఘ‌వ‌పూడి.. వెంట‌నే ప్ర‌భాస్ కంట్లో ప‌డిపోయాడు. వీరిద్ద‌రి కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్ట‌యిపోయింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. హ‌నుతో సినిమా అన‌గానే అంతా ఇదో ల‌వ్ స్టోరీ అని ఫిక్స‌యిపోయారు. ఎందుకంటే హ‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌వ్ స్టోరీలే చేశాడు. అందులో త‌న స్పెషాలిటీ చూపించుకొన్నాడు. అయితే.. ఈసారి హ‌ను ల‌వ్ స్టోరీ చేయ‌డం లేదు. ప్ర‌భాస్ స్టైల్‌, స్థాయి, క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని ఓ యాక్ష‌న్ డ్రామాని సిద్ధం చేశాడ‌ట‌. హ‌నుకి ఇది స‌రికొత్త జోన‌ర్‌. ప్ర‌భాస్ ఇది వ‌ర‌కు యాక్ష‌న్ డ్రామాలు చాలా చేశాడు, ఇప్ప‌టికీ చేస్తూనే ఉన్నాడు. అయితే వాటికీ, ఈ క‌థ‌కూ ఏమాత్రం సంబంధం లేకుండా కొత్త‌గా డిజైన్ చేశాడ‌ని టాక్‌. బ‌డ్జెట్ ప‌రంగానూ ఈ సినిమా పెద్ద‌దే అని తెలుస్తోంది. ప్ర‌భాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. స‌లార్ రావాలి. ఆ త‌ర‌వాత మారుతి సినిమా ఉంది. ప్రాజెక్ట్ కె శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఆ త‌ర‌వాత స్పిరిట్ కూడా ఉంది. స్పిరిట్ సినిమాతో పాటుగా హ‌ను క‌థ‌ని స‌మాంత‌రంగా చేయాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close