ప్రకాష్‌రాజ్‌ది ఆత్మవిశ్వాస‌మా? అహంకార‌మా?

ప్రకాష్‌రాజ్‌. గొప్ప న‌టుడు. ఆయ‌న‌ ఎంత గొప్ప న‌టుడూ అని అమాయ‌కంగా అడిగితే ఆయ‌న అందుకొన్న జాతీయ అవార్డులే స‌మాధానం చెబుతాయి. ఒక‌టి కాదు, రెండు కాదు.. ప్రకాష్ రాజ్ అంటే లెక్కకు మించిన పాత్రల్లో ఆయ‌న విశ్వరూపం గుర్తొస్తుంది. ద‌క్షిణాదిన ఖ‌రీదైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా త‌న‌దైన ముద్ర, త‌న‌కంటూ ఇమేజ్ సృష్టించుకొన్న వ్యక్తి. న‌టుడిగా ఎన్నో సినిమాల్ని ఒంటి చేత్తో న‌డిపించాడు. హీరో ఉన్నా.. వెనుక మ‌రో హీరో కూడా ఉన్నాడంటూ గుర్తు చేశాడు. ప్రకాష్ రాజ్ కోసం పాత్రలు పుడ‌తాయి. అవి ప్రకాష్ రాజ్ చేస్తే మ‌రింత పండుతాయి అనే స్థాయి సంపాదించుకొన్నాడు. సాధార‌ణంగా మేధ‌స్సు ఎక్కువ ఉన్నవాళ్లు, మాట‌కారులు, ప్రతిభావంతులు.. వీళ్లంద‌రికీ కాస్తో కూస్తో అహంకారం ఉంటుంది. పైకి మాత్రం అది ఆత్మవిశ్వాసం అనే అంద‌మైన ముసుగులా క‌నిపిస్తుంటుంది. ప్రకాష్ రాజ్‌మాట‌లు వింటే అది అహంకార‌మా? ఆత్మవిశ్వాస‌మా? ఈ రెండింటికీ మించిన‌ది ఏదైనా ఉందా అనేది సైతం అర్థం కాని అయోమ‌య ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

మ‌న ఊరి రామాయ‌ణం కోసం ప్రకాష్‌రాజ్ అటు ప‌త్రిక‌ల‌కూ, ఇటు టీవీ ఛాన‌ళ్లకు లెక్కకు మించిన ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. వీటిలో ప్రకాష్ రాజ్‌క‌ష్టం, ప్రకాష్ రాజ్ ప్రతిభ‌… వీటికంటే ప్రకాష్‌రాజ్‌లో ఉన్న అంద‌మైన అహంకారం లాంటి ఆత్మవిశ్వాసం క‌నిపిస్తోంది. నేను గొప్ప న‌టుడ్ని.. అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు తాను స‌ర్టిఫై చేసుకొన్నాడు. ప్రకాష్‌రాజ్ గొప్ప న‌టుడ‌ని మ‌నం చెప్పాలి. ఆయ‌నే చెప్పుకోవ‌డం ఏమిటి? అని మ‌న‌కు మ‌న‌మే అనుకొనేలా చేశాడు. తాను టైమ్‌కి షూటింగుల‌కు రాక‌పోవ‌డాన్ని ఇష్టంగా స‌మ‌ర్థించుకొన్నాడు. ‘నేను పొద్దుటే సెట్‌కి రాలేను. ఇష్టం ఉంటే పెట్టుకోండి లేదంటే లేదు’ అనేస్తున్నాడు. ఆక‌లితో.. న‌ట‌న‌పై క‌సితో… గెల‌వాల‌న్న కోరిక‌తో రగిలిపోయిన రోజుల్ని ప్రకాష్ రాజ్ అప్పుడే మ‌ర్చిపోయాడా??

నేను ఎవ్వరికీ అవ‌కాశాలు అడుక్కోను.. ప్రకాష్ రాజ్ కావాల్సిన‌వాళ్లు న‌న్ను వెదుక్కొంటూ వ‌స్తారు అంటూ మ‌రో ప్రశ్నకు స‌మాధానంగా చెప్పాడు ప్రకాష్ రాజ్‌. త‌న‌ని కావాల‌ని ప‌క్కకు తోసేస్తున్నార‌ని, కొంత‌మంది ప‌నిగ‌ట్టుకొని తొక్కేస్తున్నార‌ని, అందులోంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ద‌ర్శక‌త్వమ‌నే ప్రయ‌త్నమ‌ని ప్రకాష్ రాజ్ చెప్పక‌నే చెప్పేశాడా అనిపిస్తుంతోంది. ఇప్పటి వ‌ర‌కూ తాను తీసిన‌వి సినిమాలు కాద‌ట‌. సినిమా తీయ‌డానికి ట్రైల్స్ అట‌. త‌న తొలి సినిమా ఇంకా బ‌య‌ట‌కు రాలేద‌ట‌.. ఇలా కొత్త కొత్తగా ఏదో మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజ్‌. ట్రైల్స్ వేసుకోవ‌డానికి సినిమాలు తీసుకోవ‌డం ఎందుకు, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి క‌దా? ప్రకాష్ రాజ్ దృష్టిలో మ‌న ఊరి రామాయ‌ణం కూడా ట్రైల్ అనే అర్థమా?? ఓ న‌టుడు తాను ద‌ర్శకుడు అవుతాడో, లేదో .. అందుకు ప‌నికొస్తాడో లేదో తెలుసుకొనేందుకు ట్రైలర్స్‌గా సినిమాలు తీసుకోవ‌డం ఎందుకు, దాన్ని జ‌నంమీద‌కు వ‌ద‌ల‌డం ఎందుకు? ఈ విష‌యం తెలిస్తే.. మ‌న ఊరి రామాయ‌ణం సినిమాకి టికెట్లు తెగుతాయా?? ప్రకాష్‌రాజ్ న‌టుడిగా చాలా ఎదిగాడు, ఇత‌రుల‌కు నేర్పించే ప‌నిలో ఉన్నాడు. కానీ ద‌ర్శకుడిగా మాత్రం నేర్చుకొనే స్థాయిలో ఉన్నాడు. ఆ విష‌యాలు ధోని, ఉల‌వ‌చారు బిరియాని సినిమాలు, అవి సాధించిన ఫ‌లితాలు నిరూపిస్తాయి. మ‌న ఊరి రామాయ‌ణంతో ద‌ర్శకుడిగా ప్రకాష్ రాజ్ తృష్ట తీర‌లేద‌నిపిస్తోంది. అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడు. ప్రకాష్‌రాజ్‌ది ఆత్మవిశ్వాసం అయితే ఫ‌ర్వాలేదు. కానీ అది అహంకారం అయితేనే ప్రమాదం. ఈ విష‌యాన్ని ప్రకాష్ రాజ్ ఎంత త్వర‌గా గుర్తిస్తే అంత మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close