శాస్త్రి తర్వాత మోడీదే… విమానాల్లో ఫైల్స్ చూసే రికార్డ్ !

లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో విమానంలో ప్రయాణిస్తూ ఫైల్స్ చూసేవారని కథలు కథలుగా చెప్పుకుంటాం. పక్కన ఆయన భార్య ఉన్నప్పటికీ వెలుతురు సరిగ్గా లేనప్పటికీ ఫైల్స్ చూస్తున్న ఆయన ఫోటోలు ఇప్పటికి ఇంటర్నెట్‌లో విరివిగా సర్క్యూలేట్ అవుతూంటాయి. ఇప్పుడు శాస్త్రి ఫోటోలు ఇక పక్కకు పోవాల్సిందే. ఎందుకంటే అంతకు మించిన ఫోటోలు ప్రధాని నరేంద్రమోడీ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. కరోనా వల్ల ఆయన విదేశీ పర్యటనలు చాలా కాలం ఆగిపోయాయి. ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన అమెరికాకు తను ప్రత్యేకంగా సిద్ధం చేయించుకున్న ఎయిర్ ఫోర్స్ వన్ తరహా విమానంలో అమెరికా పయనమయ్యారు.

ఈ సందర్భంలో ఆయన జర్నీలో ఖాళీగా ఉండదల్చుకోలేదు. తనతో పాటు పరిశీలించాల్సిన ఫైళ్లను బ్యాగులో తీసుకెళ్లారు. విమానంలో కూర్చుని వాటిని పరిశీలించడం ప్రారంభించారు. ఓ ఫోటో గ్రాఫర్ ఆ ఫోటోలను తీశారు. ఆ ఫోటోలను మోడీ ఎంతగానో ముచ్చటపడ్డారు. తన కష్టాన్ని ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో పెట్టారు. తన కష్టం గురించి చెప్పాడు. మోడీ పక్కన బ్యాగ్.. అందులో ఫైల్స్ కూడా సెట్ ప్రాపర్టీగా ఉన్నాయి. అయినా లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో కంప్యూటర్లు కాదు కదా కనీసం జిరాక్స్ మెషిన్లు కూడా ఉండేవి కావు. అందుకే ఆయన ప్రతీది ఫైల్స్ చూసి చెక్ చేసి క్లియర్ చేయాల్సి ఉంటుంది.

కానీ ఇప్పుడు పేపర్ మీద నడిచే ఫైల్స్ తక్కువే. అంతా ఎలక్ట్రానిక్ ప్రపంచం. అయినా కానీ ప్రధానమంత్రి ఇంతగా ఎందుకు పేపర్ ఫైల్ వాడుతున్నారో చాలా మందికి క్లారిటీ లేదు. బహుశా అవి అత్యంత కాన్ఫిడెన్షియల్ అయి ఉండవచ్చని అంటున్నారు. మరి అంత కాన్ఫిడెన్షియల్ అయితే ఇలా విమానాల్లో క్లియర్ చేస్తారా అనే డౌట్ కూడా ఇతరులకు రావొచ్చు. ఏదైనా కానీ..అప్పట్లో శాస్త్రి ఫోటో కన్నా ఇప్పుడు మోడీ ఫోటోనే వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఈ ఫోటోకు ఒక్కటే తేడా ఉంటుంది. ఆ ఫోటోలో మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి భార్య ఉంటుంది. మోడీ గారికి పక్కసీట్లో కూడా ఫైల్స్ బ్యాగ్ ఉంటుంది. పని తప్ప మరొకటి తెలియని వారికి అది కామనే అని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close