ఉత్తమ్, జగ్గారెడ్డిలకు గట్టిగా ఇచ్చి పంపేసిన రాహుల్ !

ఓ మూమెంట్‌లోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చిచ్చు పెట్టి..కలహాల కాపురంగా మార్చాలని ప్లాన్ చేసుకున్న పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలకు రాహుల్ గాంధీ గట్టిగా షాక్ ఇచ్చి పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్నికల స్ట్రాటజీ పై రాహుల్ తెంలగాణ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ తోనే తాము తేల్చుకుంటామని బయట ఉత్తమ్ రెడ్డి, జగ్గారెడ్డి భీకర ప్రకటనలు చేసి ఉన్నారు. మీడియా ముందు వారు చేసిన అతి లోపల రాహుల్ కు తెలిసిందేమో కానీ..వారు తమ కంప్లైంట్లు చేయడానికి నోరెత్తగానే సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారు.. ఎవరు వేషాలేస్తున్నారో తనకు మొత్తం తెలుసని.. ఇద్దర్ని పార్టీ నుంచి పంపేస్తే మొత్తం సెట్ అవుతుందని గట్టిగానే చెప్పారు. దీంతో జగ్గారెడ్డి, ఉత్తమ్ రెడ్డి గతుక్కుమన్నారు. మళ్లీ నోరు తెరవలేదు. రాహుల్ గాంధీ అదే సమయంలో .. ఎవరైనా పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే సహించేది లేదని.. నేరుగా బయటకు పంపడమేనని తేల్చి చెప్పారు. ఏదైనా సమస్యలుంటే పార్టీ దృష్టికి తేవాల్సిందేనని చెప్పారు.

ఇటీవల పార్టీ లో తమపై దుష్ప్రచారం జరుగుతోందంటూ.. ఉత్తమ్ , జగ్గారెడ్డి మాత్రమే మాట్లాడుతున్నారు. రాహుల్ తో మీటింగ్ కు వెళ్లే ముందు జగ్గారెడ్డి కూడా.. కాంగ్రెస్ లోనే దరిద్రం అంటూ వ్యాఖ్యలు చేశారు . అవి మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రాహుల్ ఇక సహించేది లేదని తేల్చేసినట్లుగా చెబుతున్నారు. సమావేశం తర్వాత ఇతర పార్టీ పెద్దలుకూడా వారిద్దరికీ అదే చెప్పారని.. పార్టీలో ఉండాలనుకుంటే పార్టీ లో రచ్చ చేస్తే కుదరదని తేల్చేసినట్లుగా చెబుతున్నారు.దీంతో చిచ్చు పెట్టి మీడియాలో చర్చ పెట్టాలనుకున్న ఉత్తమ్, జగ్గారెడ్డిలకు నోటి మాట రాని పరిస్థితి ఎదురయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close