హిట్టయితే యాక్టింగ్ మానేస్తాడట!

‘సినిమా హిట్టయితే యాక్టింగ్ మానేస్తా’… ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా? ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్. హిట్ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ తరవాత రెండు మూడు అవకాశాలు వస్తాయి. హిట్టిచ్చిన హీరోలు, దర్శకులపై కర్చీఫ్ వేయడం ఇండస్ట్రీలో కామన్. హిట్ తరవాత వచ్చే అవకాశాలను క్యాష్ చేసుకోకుండా మానేస్తాననడం రాహుల్ రవీంద్రన్ మూర్ఖత్వం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే… క్యాష్ చేసుకోవడానికి యాక్టింగ్ మానేస్తానంటున్నాడీ హీరో. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటిస్తున్న ‘చి.ల.సౌ’ సినిమాతో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టయితే యాక్టింగ్ మానేస్తానని క్లోజ్ సర్కిల్స్ దగ్గర చెప్పాడట. అంటే కంప్లీట్ డైరెక్షన్ మీద కాన్సంట్రేట్ చేస్తానని మీనింగ్ అన్నమాట. ఒకవేళ దర్శకుడిగా తొలి సినిమా సినిమా హిట్ కాకున్నా ఈ హీరోకి వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే.. తమ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో రెండు సినిమాలు డైరెక్ట్ చేయమని రాహుల్ రవీంద్రన్ చేతిలో నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య అడ్వాన్స్ పెట్టాడు. ఈ సినిమా ప్లాప్ అయినా దర్శకుడిగా మరో రెండు సినిమాలు చేసే ఛాన్స్ ముందే అందుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close