రాజమౌళికి కొత్త తలనొప్పి

రాజమౌళి కుటుంబమంతా కలసికట్టుగా సినిమాలు చేస్తుంది కానీ ఎవరి వ్యక్తిగత స్వేఛ్చవారిదే. కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి.. వీరి భావజాలాలు వేరువేరు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా చాలా స్వేఛ్చగా తమ మనసులో మాట పంచుకుంటారు. అయితే ఇందులో రాజమౌళి కాస్త లౌక్యం పాటిస్తారేమో కానీ కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ కుండబద్దలు కొట్టినట్లు మాట్లడతారు.

కీరవాణి సాధారణంగా మీడియా ముందుకు రారు. పర్శనల్ ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే సెలక్టివ్ మీడియా పీపుల్ తోనే మాట్లాడతారు. వారితో తన మనసులో వున్న భావాలని చాలా ఓపెన్ గా చెప్పేస్తారు. అందులో విషయాలు ఎంత వరకూ రాయలి, ఎంత అఫ్ ది రికార్డ్ ఉంచాలనేది సదరు మీడియా ప్రతినిధి చేతిలో వుంటుంది. ఇలా ఇంటర్వ్యూలు కూడా ఎప్పుడో కానీ ఇవ్వరు.

రాజమౌళి అయితే మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా వుంటారు. ఆయన మీడియా కి ఓపెన్ అవ్వడమే తక్కువ. తన సినిమాకి సంబధించిన పీఆర్ వర్క్ కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. సినిమాకి కొబ్బరికాయ్ కొట్టినప్పటి నుంచి విడుదలై రన్ పూర్తయిన వరకూ ప్రతి విషయంలో కేర్ తీసుకుంటారు. ఆయన ద్రుష్టి మీడియా ఇంటరాక్షన్లు మీద కాకుండా సినిమాని ఎంత క్రియేటివ్ గా జనాల్లోకి తీసుకెలుతున్నామనే పాయింట్ మీదే వుంటుంది.

కానీ విజయేంద్రప్రసాద్ ఇందుకు భిన్నం. ఆయన వ్యవహారం అంతా డిఫరెంట్ గా వుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా తెరిస్తే చాలు.. ఎక్కడ చూసినా విజయేంద్రప్రసాద్ టాపిక్కు.. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ వార్. ఎప్పుడో రెండేళ్ళ క్రితం వచ్చిన సినిమా గురించి ఇప్పుడెందుకు రచ్చ చేస్తున్నారంటే.. దీనికి కారణం విజయేంద్రప్రసాద్ మార్క్ కామెంట్. ఇప్పుడు సందర్భం ఏమిటో తెలీదు కానీ.. లేటెస్ట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆర్ఆర్ఆర్ లోని తారక్ పాత్రని ఒక ‘సపోర్టింగ్’ క్యారెక్టర్ గా పోల్చిన తీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. దీంతో ట్విట్టర్ వార్ మొదలైయింది.

నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎవరి పాత్ర ఎంత అనేది ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఒక సున్నితమైన అంశంగా మారింది. గతంలో కూడా దీనిపై చాలా ఫ్యాన్ వార్స్ జరిగాయి. ఆర్ఆర్ఆర్ చివర్లో రామ్ చరణ్ కు అల్లూరి గా ఇచ్చిన ఎలివేషన్ లాంటి సీను.. తారక్ కు ఇవ్వలేకపోయరని ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అది సినిమా.. కథ ప్రకారం పాత్రలు వుంటాయి కదా.. ఇలా వంతులు వేసుకోవడం ఏమిటి ? అని అనొచ్చు. కానీ ఫ్యాన్స్ అభిమానం మరో స్థాయిలో వుంటుంది. ఎంత కంట్రోల్ చేసినా సహజంగానే ఇలాంటి వంతులు, పోలికలు వస్తాయి.

అయితే ఆ వివాదం అక్కడితో ముగిసిందనుకునే తరుణంలో ఇప్పుడు విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు మళ్ళీ మంట రాజేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై భీవత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ ట్రోల్స్ అన్నీ ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టిన రాజమౌళికి తలనొప్పి తెచ్చేవే అని చెప్పాలి. నిజానికి ఈ విషయంలో రాజమౌళి మొదటి నుంచి తండ్రి విజయేంద్రప్రసాద్ జాగ్రత్తలు చెబుతూనే వున్నారు. గతంలో ఇలాంటి ట్రోల్స్ వచ్చినపుడు ”ఇలాంటి సున్నితమైన విషయాలు గురించి జాగ్రత్తగా స్పందించాలి’ అని రాజమౌళి తండ్రికి సూచించినట్లు వినిపించింది.

అలాగే మహేష్ బాబు తో చేస్తున్న సినిమాపై కూడా మీడియాకు లీకులు ఇవొద్దని కూడా చెప్పారట రాజమౌళి. కానీ విజయేంద్రప్రసాద్ ప్రసాద్ మాత్రం తన ధోరణి ముందుకు వెళుతున్నారు. మహేష్ బాబు సినిమా కథ, దాని నేపధ్యం, జోనర్, షూటింగ్ లోకేషన్స్.. ఇవన్నీ మీడియాకు ఆయనే అందించారు. సినిమా పూర్తయ్యే వరకూ వేరే ఫోటో షూట్స్ లో పాల్గోకూడదు, మీడియా ద్రుష్టిలో పడకూడదని ఒకవైపు మహేష్ బాబుకు కండీషన్లు పెడుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజమౌళి. కానీ విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఇలా అసందర్భ ట్రోల్స్ బారిన పడి అనవసరమైన వివాదాలుకొని తెచ్చుకుంటున్న తీరు రాజమౌళికి చికాకు కల్గిగిస్తుందనే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close