టీవీల్లో చూసేసింది.. టికెట్ కొని చూస్తారా?

రాజ‌మౌళి స్ట్రాట‌జీ చాలా భిన్నంగా ఉంటుంది. త‌న సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో రాజ‌మౌళికి బాగా తెలుసు. ఓ క‌థ‌ని రెండు భాగాలుగా విడ‌గొట్టి సొమ్ము చేసుకోవొచ్చ‌ని బాహుబ‌లితో నిరూపించుకొన్నాడు. ఇప్పుడూ అలాంటి వినూత్న ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ ఈనెల 28న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి పార్ట్ 2 కంటే ముందు పార్ట్ 1ని ఇప్పుడు రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. అదీ… హిందీలో. రేపు (ఏప్రిల్ 7న) బాహుబ‌లి ది బిగినింగ్ హిందీ వెర్ష‌న్ రీ రిలీజ్అవ్వ‌బోతోంది. ముంబై, ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లోని మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో బాహుబ‌లిని చూడొచ్చు. బాహుబ‌లి 2 చూసే ముందు బాహుబ‌లి 1 చూస్తే క‌థ‌లో కంటిన్యుటీ తెలుస్తుంద‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. అదీ నిజ‌మే. ఎందుకంటే.. బాహుబలి 1 విడుద‌లై.. దాదాపు రెండేళ్ల‌య్యింది. బాహుబ‌లి 2 కంటిన్యుటీ కోస‌మైనా బాహుబ‌లి 1 చూపించ‌డం బెట‌ర్‌.

అయితే.. ఆల్రెడీ టీవీల్లో బాహుబ‌లి చాలా సార్లు ప్ర‌ద‌ర్శిత‌మైంది. యూ ట్యూబ్ లోనూ ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమాని చాలా సార్లు చూసేశారు. ఇప్పుడు మ‌ళ్లీ థియేట‌ర్లో చూస్తారా? అదీ టికెట్టు కొనుక్కొని…? అనేది అనుమానంగా మారింది. అయితే… మ‌ల్టీప్లెక్స్‌లో అడ్వాన్స్ బుకింగులు మొద‌లైపోయాయ‌ని టాక్‌. థియేట‌ర్లు హౌస్‌ఫుల్ కాక‌పోయినా క‌నీసం స‌గ‌మైనా నిండే ఛాన్సుంది. ఎందుంకంటే బాహుబ‌లి లాంటి సినిమాని చిన్న చిన్న స్క్రీన్‌లో చూస్తే కిక్ ఉండ‌దు. ఈ విజువ‌ల్ వండ‌ర్‌ని వెండితెర‌పైనే చూడాలి. అందుకే రీ రిలీజ్ అయినా స‌రే టికెట్లు తెగుతాయ‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడు.చూద్దాం సెకండ్ రిలీజ్ లో బాహుబ‌లి స‌త్తా ఏంటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close