రాజధాని ఫైల్స్ రివ్యూ: అమ‌రావ‌తి రైతు వ్య‌ధ‌

rajdhani files movie Review

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

-అన్వ‌ర్‌

ప్రభుత్వాలు వేరు రాజకీయ పార్టీలు వేరు. కానీ దురదృష్టం ఏమిటంటే.. రాజకీయ పార్టీ వ్యక్తిగత ఎజెండాలే ప్రభుత్వం ఎజెండాలుగా మారడం కళ్ళారా చూస్తున్నాం. దీనికి సజీవ సాక్ష్యం ‘అమరావతి’. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు. నాడు రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఓ ప్రభుత్వం.. చట్టసభల్లో రాష్ట్రానికి రాజధానిగా ‘అమరావతి’ అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుదని, ప్రతిపక్షం సమ్మతితోనే ఒక చట్టం చేసి రాజధాని కోసం భూములని కోరింది. అక్కడి రైతులు కూడా ప్రభుత్వం చట్టం చేసిందనే నమ్మకంతో స్వచ్చంధంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. పలు నిర్మాణాలు జరిగాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత చట్టాన్ని తుంగలో తొక్కి, రాజధానిని గాలికొదిలేసి, భూములిచ్చిన రైతుల్ని రోడ్డున పడేసింది. ఈ అన్యాయాన్ని, అక్కడి రైతుల అవేదనని, వారి పోరాటాన్ని ఆధారంగా చేసుకొని దానికి కొంత కల్పన జోడించి ‘రాజధాని ఫైల్స్’కు తెరరూపం ఇచ్చారు. మరా చిత్రంలో చూపించిన రైతుల ఆవేదన ప్రేక్షకులని హత్తుకుందా? అహంకార రాజకీయాల కారణంగా సామాన్య రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు?

ఫిక్షనల్ గా పేర్లలో మార్పులు వున్నాయి కానీ ఇది అందరికీ తెలిసిన కథే. కొత్తగా ఏర్పడిన ‘అరుణప్రదేశ్’ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి రాజధాని ఉండాలనే ఉద్దేశంతో ‘అయిరావతి’ ప్రాంతాన్ని కొత్త రాజధానిగా చట్టం చేస్తుంది నాటి ప్రభుత్వం. ఏడాదికి మూడు పంటలు పండే బంగారం లాంటి భూమిని ప్రభుత్వం మాటపై విశ్వాసంతో రాజధాని కోసం స్వచ్చంధంగా ఇస్తారు అక్కడి రైతులు. నాలుగేళ్ల తర్వాత మరో పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయిరావతి రాజధానిగా ఉంటే గత ముఖ్యమంత్రి పేరే చరిత్రలో నిలిచిపోతుందని ఓ పొలిటికల్ ఎనలిస్ట్ కొత్త ముఖ్యమంత్రికి సలహా ఇస్తాడు. దీంతో ఆ కొత్త ముఖ్యమంత్రి.. అయిరావతి ఆనవాళ్ళు లేకుండా చేయడానికి చట్టం ప్రకారం అయిరావతి రైతులకి ఇచ్చిన హామీలు, భరోసాను తుంగలోకి తొక్కి రాష్ట్రానికి నాలుగు రాజధానులు వుంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందనే ఓ కుట్రకి తెరతీస్తాడు. అప్పుడు రాజధాని రైతులు ఏం చేశారు? నమ్మిన ప్రభుత్వాలే ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తుంటే న్యాయం కోసం ఎవ‌రు, ఎలాంటి పోరాటం చేశారు? అమాయకరైతులపై ప్రభుత్వం ఎలాంటి కుట్రలు పన్నింది? ఇవన్నీ తెరపై చూడాలి.

వాస్తవ సంఘటనలకు ఫిక్షన్ జోడించి చెప్పడం ఒక ఆర్ట్. ఈ చిత్ర దర్శకుడు భాను.. వాస్తవ సంఘటనల్లోని ఎమోషన్ ని పట్టుకున్నాడు. ఒక రాష్ట్రానికి సంబధించిన ఈ కథని భార్యా భర్తలైన వినోద్ కుమార్, వాణీ విశ్వనాధ్‌ పాత్రలని పరిచయం చేస్తూ ఒక ఫ్యామిలీ కథగా మొదలుపెట్టి తర్వాత ఊరు, అక్కడి మనుషులు, భూమితో వారికున్న అనుబంధం చూపిస్తూ కథని ముందుకు నడిపాడు. ‘ఏరువాక’ పాట ప్లేస్మెంట్‌ అర్ధవంతంగా కుదిరింది. అమరావతి రైతుల పోరాటం గురించి నిత్యం టీవీల్లో చూసే వుంటాం. ఆ పోరాటాన్ని, వారి వెనుక వున్న ఆవేదనని పదునైన మాటలతో చూపించే ప్రయత్నం చేశాడు. అధికారిక పార్టీకి చెందిన ఓ ముఠా రాజధాని రైతులపై చేసిన దమనకాండను ప్రభావంతంగా చిత్రీకరించాడు. ముఖ్యమంత్రి ఫేక్ లైవ్స్ ఎపిసోడ్ ని బాగా చిత్రీకరించారు. సెకండ్ హాఫ్ లో చేసిన న్యాయపోరాటం, మహా పాదయాత్ర, ఉద్యమంలో విద్యార్ధులు భాగమైన సన్నివేశాలు ఇవన్నీ సహజంగానే వుంటాయి

నిజంగా జరిగిన కథ ఇది. ఈ కథలో ఆవేదన వుంది. రైతుల ఆక్రోశం వుంది. వీటిని తెరపైకి చక్కగానే తీసుకొచ్చాడు. అయితే రైతుల పోరాటం వరకూ బలంగానే చూపించిన దర్శకుడు ఫిక్షన్ ని జోడించడంలో ఇంకాస్త వర్క్ చేసుంటే బెటర్ ఉండేదనే అభిప్రాయం కలుగుతుంది. వినోద్ కుమార్ కొడుకు గౌతమ్ పాత్రకు ఫిక్షన్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. ఆ పాత్రని వాడుకున్న తీరు అంతగా కుదరలేదు. అసెంబ్లీకి వెళ్లి నిలదీయడం, అర్టిఫీషియల్ ఇంటెలెజెన్స్ సహాయంతో ప్రభుత్వ పెద్దల ఎకౌంట్స్‌ హ్యాక్ చేయడం ఇవన్నీ ఫిక్షనల్ సినిమాటిక్ ఎలిమెంట్స్ అయినప్పటికీ ఇందులో మాత్రం అంత ప్రభావంతగా కుదరలేదు. పైగా ఆ పాత్ర చేసింది కొత్త నటుడు. దీంతో ఆ సన్నివేశాలు తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథకు ఇచ్చిన ముగింపు కూడా సినిమాటిక్ గానే వుంటుంది. ‘ప్రజాధనంతో ప్రజారాజధాని’ కాన్సెప్ట్ చూపించారు. నిజానికి ఒక కమర్షియల్ సినిమాకి పనికొచ్చే ఐడియా ఇది. కానీ ఇందులో హ‌డావుడిగా ఇరికించేసినట్లుగా వుంటుంది.

రైతుల ప్రతినిధిగా వినోద్ కుమార్ నటన ఆకట్టుకుంటుంది. వాణీ విశ్వనాథ్ పాత్ర కూడా హుందాగా బలమైన స్త్రీ పాత్రగా తీర్చిదిద్దారు. ఈ ఇద్దరూ తప్పితే మరో పేరున్న నటుడు కనిపించరు. బహుసా ఈ కారణం వలన ఇందులో చాలా సన్నివేశాలు అందులోని కోర్ ఎమోషన్ పట్టు తప్పినట్లు కనిపిస్తుంది. గౌతం పాత్రలో చేసిన అఖిల్ బావున్నాడు కానీ కాస్త ఇమేజ్ వున్న నటుడు వుంటే బావుండేది. గౌతం పాత్రకు వాణీ విశ్వనాథ్ ఇచ్చిన ఎలివేషన్ వర్క్ అవుట్ కాకపోవడానీ ఇదీ ఓ కారణం. ముఖ్యమంత్రిగా చేసిన నటుడికి సంభాష‌ణ‌లు బాగా తగ్గించేశారు. ఆ పాత్రని ఇంకాస్త యాక్టివ్ చేయాల్సింది. ట్రైలర్ లో ఆసక్తిని పెంచిన గొడ్డలి సీన్ ఇందులో వుంది. ఈ గొడ్డలికి బలైయింది ఎవరు అనేది తెరపై చూడాలి. ఇందులో పొలిటికల్ ఎనలిస్ట్ పాత్రకు ఎక్కువ సీన్స్‌ ఇచ్చేశారు. ఒక ఎయిర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా పెట్టారు. మిగతా పాత్రన్నీ కొత్తనటులే పరిధి మేర చేశారు.

మణిశర్మ నేపధ్య సంగీతం బాగా కుదిరింది. ఏరువాక పాటని బ్లెండ్ చేసిన విధానం బావుంది. రైతుల ఆత్మ హత్యల సందర్భంలో వచ్చిన ఓ ఎమోషనల్ సాంగ్ కూడా బావుంది. విజువల్స్ లో సినిమాటిక్ ఫీల్ కలిగించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. బహుసా నిర్మాణంలో ఇబ్బందులేమో కానీ చాలా చోట్ల ఇది ఒక డ్యాక్యూమెంటరీ ఫీల్ ఇస్తుంది. మాటలు బలంగానే వున్నాయి. ఎక్కువగా రాజకీయాల జోలికి పోకుండా రైతుల ఆవేదననే తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ఫినిషింగ్ ట‌చ్‌: అమ‌రావ‌తి ఆక్రంద‌న‌

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

-అన్వ‌ర్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close