బీజేపీ మార్క్ ప్రజాస్వామ్యం..! బలం లేదని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వాయిదా..?

ఢిల్లీ రాజకీయాల్లో కొద్ది రోజులుగా… రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకూ మెజార్టీ లేదు. మిత్రపక్షాలు.. ప్రస్తుత రాజకీయ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చే అభ్యర్థికే… ఎడ్జ్ కనిపిస్తోంది. కానీ విపక్షాలకు.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇష్టం లేదు. అందుకే బీజేపీ వ్యూహకర్తలు మరో వ్యూహం సిద్ధం చేశారు. యుద్ధం చేయలేకపోతే.. వాయిదా వేసుకోవడం బెటర్ అన్నట్లుగా వారి వ్యూహం ఉంది. అసలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వాయిదా వేద్దామని దాదాపుగా నిర్ణయించేశారు. అందుకే 18వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నా… ఇంత వరకూ.. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం రాజ్యసభ ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు.

సంప్రదాయం ప్రకారం… రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టును.. విపక్ష పార్టీలకు ఇస్తూంటారు. కానీ నరేంద్రమోడీ మాత్రం.. ఆ పదవి కూడా బీజేపీ చేతిలోనే ఉండాలని భావిస్తున్నారు. అందుకే విపక్షాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఇవ్వడం లేదు. కానీ.. సొంతంగా గెలిపించుకోవడానికి కూడా.. బీజేపీ దగ్గర సరిపడా బలం లేదు. జూలై 2వ తేదీతో.. పి.జె.కురియన్ పదవీ కాలం కూడా ముగిసింది. ఇప్పుడు తప్పనిసరిగా.. ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి. కానీ బీజేపీ మాత్రం…వాయిదాకే మొగ్గు చూపుతోంది. దాని కోసం రాజ్యాంగాన్నే అడ్డు పెట్టుకుంటోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఖాళీ అయిన తర్వాత కచ్చితంగా ఇన్ని రోజుల్లో భర్తీ చేయాలని.. రాజ్యాంగంలో లేదని.. చెప్పుకొస్తున్నారు.

కురియన్ స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకోవాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇప్పటికే కేంద్రానికి సూచించారు. ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించాలని కోరారు. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ కూడా వెంకయ్యనాయుడుతో సమావేశమ్యారు. అయినా కేంద్రం సైలెంట్ అయిపోయింది. రాజ్యసభ చైర్మన్ ఒక్కరే సభ నిర్వహించడం కష్టం కాబట్టి… డిప్యూటీ చైర్మన్ అవసరం ఉంటుంది. కానీ తాత్కలిక డిప్యూటీ చైర్మన్ ను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి ఎన్నిక అవసరం లేదు. ప్రభుత్వం ఈ విధానానికే మొగ్గు చూపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధిస్తుంది..?

లోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వారివే. 14సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే,తాము డబుల్ డిజిట్ స్థానాలను దక్కిచుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ కూడా...

మళ్లీ డేట్ మార్చుకొన్న విశ్వ‌క్ సినిమా

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'. ఎప్పుడో రెడీ అయినా, ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. మార్చిలో రావాల్సిన సినిమా ఎల‌క్ష‌న్ల వ‌ల్ల ఆగింది. ఎన్నిక‌లు అయిపోయిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close