నా ఇల్లు నేనే కొనుక్కొన్నా

ఈమ‌ద్య ర‌కుల్ ప్రీత్‌సింగ్ గురించి ఓ రూమ‌ర్ భ‌యంక‌రంగా చ‌క్క‌ర్లు కొట్టింది. ర‌కుల్‌కి ఓ హీరో ఏకంగా కోటి రూపాయ‌ల గిఫ్ట్ ఇచ్చాడ‌ట‌. అదీ.. ఓ ఇంటి రూపంలో. కోటి రూపాయ‌ల విలువ‌ల గ‌ల ఓ ఇల్లు కొని ర‌కుల్‌కి బ‌హుమానంగా ఇచ్చాడ‌ట ఓ హీరో. ఆ హీరో ఎవ‌రంటూ.. టాలీవుడ్‌లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యాన్నే ర‌కుల్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే… ”నాకు ఎవ‌రో ఇల్లు కొనిపెట్ట‌డం ఏమిటి? నాన్సెన్స్‌” అంటోంది. ఇలాంటి రూమ‌ర్లు నేను ప‌ట్టించుకోను.. అని ఘాటుగా స‌మాధానం చెబుతోంది.

”హైద‌రాబాద్‌లో నేను ఇల్లు కొనుక్కొన్న మాట వాస్త‌వ‌మే. అయితే.. అది నా సొంత డ‌బ్బుల‌తో కొనుక్కొన్న ఇల్లు. సినిమాల్లోకి అడుగుపెట్టిన వెంట‌నే కారు కొనుకొన్నా. ఆ త‌ర‌వాత జిమ్ పెట్టా. ఇప్పుడు ఇల్లు కొనుకొన్నా. ప్ర‌తి పైసా నాదే. నాకు డ‌బ్బుల విలువ తెలుసు. విచ్చ‌ల విడిగా ఖ‌ర్చుపెట్ట‌ను. పొదుపుగా దాచుకొన్నా కాబ‌ట్టి… ఇప్పుడు ఇల్లు కొన్నా. అందులోనూ నాన్న‌గారి డ‌బ్బులున్నాయి. ఆయ‌న పేరు మీద లోన్ కూడా తీసుకొన్నా..” అని స‌మాధానం ఇచ్చింది. సో… ర‌కుల్ ప్రీత్‌.. ఇంటి ర‌హ‌స్యం అది. ఇక‌నైనా రూమ‌ర్లు ఆపండి బాబూ…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోవిషీల్డే కాదు… కోవాగ్జిన్ తోనూ ప్రమాదమే..!!

కరోనా వైరస్ నిర్మూలన కోసం తయారు చేసిన కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్ నిజమేనని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించగా... భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ తో కూడా దుష్ఫలితాలు ఉన్నాయని తాజాగా...

ఓటమి భయమా – మోడీ, షా వ్యాఖ్యల అంతరార్ధం ఇదేనా..?

ఓ వైపు మేమే అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా... ప్రధాని మోడీ, అమిత్ షా మాత్రం చార్ సౌ పార్ నినాదాన్ని వదిలేసి ఇండియా అధికారంలోకి వస్తే అంటూ...

సీట్ల సంఖ్య తేల్చేందుకు కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే

లోక్ సభ ఎన్నికల్లో 13 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ, సీట్ల సంఖ్యపై ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేందుకు ఇంటర్నల్ సర్వే చేపట్టింది. హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో ఏయే...

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close