మావాడిపై ఓ క‌న్నేసి ఉంచండి: రామ్ చ‌ర‌ణ్‌

ఉప్పెన ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో వ‌చ్చాడు. త‌నే వైష్ణ‌వ్ తేజ్‌. ఉప్పెన సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో… రాజ‌మండ్రిలో.. స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి రామ్ చ‌ర‌ణ్ తేజ్ అతిథిగా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా వైష్ణ‌వ్ తేజ్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేశాడు. వైష్ణ‌వ్ బుద్ధిమంతుడిలా క‌నిపిస్తున్నా, లోప‌ల ఓ విస్పోట‌నం దాగుంద‌ని, ఈ కుర్రాడిపై ఓ క‌న్నేసి ఉంచాల‌ని…. స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. త‌న‌కు వైష్ణ‌వ్ లా న‌టించ‌డానికి ఏడెనిమిది సినిమాల స‌మ‌యం ప‌ట్టింద‌ని, కానీ… తొలి సినిమాకే వైష్ణ‌వ్ మెచ్యూరిటీ చూపించాడ‌ని కొనియాడాడు. తొలి సినిమా హీరోకి ఇన్ని క‌ల‌క్ష‌న్లు దొర‌కడం నిజంగా ఓ అరుదైన విష‌య‌మ‌ని, ఇది గ్రేట్ డెబ్యూ అని కితాబు ఇచ్చాడు.

“వైష్ణ‌వ్ మా కంటే భిన్నంగా ఆలోచిస్తాడు. సెటిల్డ్ గా ఉంటాడు. అందుకే తాను ఈ స‌క్సెస్ కొట్ట‌డంలో నాకు వింతేం క‌నిపించ‌డం లేదు. త‌న‌లో డెడికేష‌న్ చూసే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బాబాయ్ వైష్ణ‌వ్ కు ట్రైనింగ్ ఇప్పించారు. మానాన్న‌గారు ఈ క‌థ‌ని 4 సార్లు విన్నారు. నా సినిమా కోసం కూడా అంత స‌మ‌యం వెచ్చించి ఉండ‌రు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వ్య‌క్తులు మా చుట్టూ ఉండ‌డం మా అదృష్టం” అన్నాడు చ‌ర‌ణ్‌. క‌రోనా కార‌ణంగా 2020 పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింద‌ని, ఈ ద‌శ‌లో.. మ‌ళ్లీ కోలుకున్న ఏకైక ఇండ్ర‌స్ట్రీ.. సినిమా ప‌రిశ్ర‌మ అని, ఇదంతా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని చెప్పుకొచ్చాడు చ‌ర‌ణ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close