నేను-శైలజ సినిమాపై టీవీ 5 వ్యతిరేకప్రచారం, రామ్ అసంతృప్తి

హీరో రామ్ నూతన సంవత్సర కానుకగా వచ్చిన నేను శైలజ సినిమా అందరి మన్నలను పొందుతుంది. అయితే సినిమా గురించి ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ మాత్రం సినిమా ఫ్లాప్ అంటూ కథనాలు ప్రసారం చేయడంతో రామ్ ఆ ఛానెల్ మీద అసంతృప్తిని వ్యక్తపరిచాడు. పనికట్టుకుని తన సినిమా మీద ప్రతికూల ప్రచారం చేయడంతో నిర్గాంత పోయిన రామ్ ఆ ఛానెల్ చేస్తున్న ప్రచారం గురించి తన ట్విట్టర్లో ప్రస్థావిస్తూ బాధపడ్డాడు.

నిర్మాతతో ప్రాబ్లెం ఉంటే తప్పుడు రివ్యూస్ ఇవ్వడం.. పొలిటిషియన్ తో ప్రాబ్లెం ఉంటే తప్పు వార్తలు ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ ఆ ఛానెల్ పై తన అసంతృప్తిని వ్యక్త పరిచాడు రామ్. రాక రాక వచ్చిన హిట్ ని ఎంజాయ్ చేద్దామనే ఆలోచనలో ఉన్న తనకు ఓ ప్రముఖ ఛానెల్ వారు తలనొప్పిగా మారడం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇలా రన్నింగ్ లో ఉన్న న్యూస్ ఛానెల్ బేస్ లెస్ వార్తలు ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో నమకాన్ని కోల్పోతుందని అభిప్రాయపడ్డాడు.

తన సినిమా గురించి ప్రతికూలంగా ప్రచారం చేసినా ఆ న్యూస్ ఛానెల్ మీద తనకు గౌరవం ఉందని.. ఇలాంటి రివ్యూలతో తమ ప్రమాణాలను వారే దిగజార్చుకుంటున్నారని ట్విట్టర్లో ఘాటుగానే స్పందించాడు రామ్. ఇక చివరగా నేను.. శైలజ.. ఆ ఒక్క ఛానెల్ లో తప్ప వరల్డ్ వైడ్ గా విడుదలైన అన్ని చోట్ల బాగా రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. లవ్ యు ఆల్ అంటూ ప్రేక్షకులనుద్దేశించి తన ట్విట్టర్ సంభాషణలను ముగించాడు రామ్. మరి రామ్ ట్విట్టర్లో పెట్టిన ఆ మెసేజ్ లకు సదరు న్యూస్ ఛానెల్ వారు ఎలా కవర్ చేసుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close