బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? బాహుబలి సినిమా రిలీజ్ అయిన మరుక్షణం నుంచి ఈ ప్రశ్న ట్రెండ్ అవుతూనే ఉంది. రాజమౌళి అండ్ కో కూడా ఈ ప్రశ్నకు మంచి పబ్లిసిటీ వచ్చేలా చేశారు. బాహుబలి-ది కంక్లూజన్ చూడాలన్న ఆసక్తిని డబుల్, త్రిబుల్ చేస్తున్న ప్రశ్న అదే కదా. ఈ ప్రశ్న చుట్టూ మీడియా కూడా చాలా రాతలు రాసేసింది. ఎవరికి తోచిన సమాధానాన్ని వాళ్ళు రాసేశారు. దానికి తోడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకు సంబంధించిన సన్నివేశాన్ని రాజమౌళి ఎంత జాగ్రత్తగా చిత్రీకరించాడు? ఎంత మంది క్రూతో, ఎంత సీక్రెట్‌గా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాడు అన్న విషయాన్ని కూడా చాలా ఆసక్తికరంగా చెప్పారు. ఆ సీన్ ఏంటన్న విషయం రాజమౌళికి, విజయేంద్రప్రసాద్‌కి తప్ప ఇంకెవ్వరికీ తెలియకుండా తీశారన్న రేంజ్లో వార్తలు రాసేశారు.
అయితే అసలు విషయాన్ని ఈ రోజు మీడియాతో పంచుకన్నాడు రానా. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకు సమాధానం యూనిట్లో ఉన్న అందరికీ తెలుసని చెప్పుకొచ్చాడు. సినిమాకు వర్క్ చేస్తున్న అందరికీ మొత్తం కథను చాలా స్పష్టంగా రాజమౌళి చెప్పేశాడని చెప్పాడు. అది కూడా ఐదేళ్ళ క్రితం నుంచే రెండు భాగాలకు సంబంధించిన కథపైన అందరికీ కూడా పూర్తి అవగాహన ఉందని చెప్పుకొచ్చాడు రానా. సో…..ఇక మీదటైనా బాహుబలి-ది కంక్లూజన్ రిలీజ్ అయ్యే వరకూ కాస్త ఊహాగానాలను కట్టిపెడితే బాగుంటుందేమో.