చేతులెత్తేసిన ‘రంగ‌మార్తండ‌’ నిర్మాత‌

కృష్ణ‌వంశీ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా `రంగ‌మార్తాండ‌`. ఓ మ‌రాఠీ సినిమాకి ఇది రీమేక్‌. ప్ర‌కాష్ రాజ్‌, బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతానికైతే ఈ సినిమా ఆగిపోయింద‌ని టాక్. మ‌రో 20 రోజుల షూటింగ్ ఉంద‌న‌గా… `నేను ఈ సినిమాకి మ‌రో పైసా కూడా పెట్టుబ‌డి పెట్ట‌లేను` అని నిర్మాత చేతులెత్తేసిన‌ట్టు తెలుస్తోంది. సినిమా చివ‌రి ద‌శ‌లో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎవ‌రైనా షాకే.

అందుకే కృష్ణ‌వంశీ ఇప్పుడు మ‌రో నిర్మాత కోసం అన్వేషిస్తున్నాడ‌ని తెలుస్తోంది. కృష్ణ‌వంశీది ఎప్పుడూ జ‌క్క‌న్న స్టైల్‌. త‌న‌కు న‌చ్చే అవుట్ పుట్ వ‌చ్చేంత వ‌ర‌కూ… సినిమాని తీస్తూనే ఉంటాడు. ఇప్ప‌టికే సినిమాకి అనుకున్న బ‌డ్జెట్ దాటిపోయింద‌ని, ఇప్పుడు ఫైనాన్స్ కూడా తెచ్చుకోలేని ప‌రిస్థితుల్లో… నిర్మాత సైడ్ అయిపోయాడ‌ని స‌మాచారం. మిగిలిన షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్ష‌న్‌, ప‌బ్లిసిటీ, పేమెంట్లు.. ఇలా చాలా ఖ‌ర్చు వుంది. అవ‌న్నీ భ‌రించ‌డానికి మ‌రో నిర్మాత అవ‌స‌రం వ‌చ్చింది. మ‌రో నిర్మాత దొరికేంత వ‌ర‌కూ ఈ సినిమా పెండింగ్ లో ఉన్న‌ట్టే. `న‌క్ష‌త్రం` లాంటి డిజాస్ట‌ర్ త‌ర‌వాత‌.. చాలా గ్యాప్ తీసుకున్నాడు కృష్ణ‌వంశీ. ఈ సినిమాతో ఎలాగైనా త‌న మార్క్ చూపించాల‌ని భావిస్తున్నాడు. అలాంటి సినిమాకి అనుకోని ఆటంకం ఏర్ప‌డింది. అయినా కృష్ణ‌వంశీకి ఇవ‌న్నీ మామూలే. ఇలా అవాంత‌రాల్ని దాటుకొచ్చిన ప్ర‌తీసారీ వంశీ హిట్టు కొట్టాడు. ఈసారి ఏం అవుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close