టీమిండియా ఓటమికి కారణం ఇదే… !?

అమెరికాలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అలాగే, భారత క్రికెట్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. స్థిరత్వం లేని జట్లలో మనోళ్లదే నెంబర్ వన్. ఆస్ట్రేలియా సిరీస్ లో వరుసగా మూడు వన్డేల్లో ఓడిపోయి మన జట్టు హ్యాట్రిక్ సాధించింది.

ఆటలో గెలుపు ఉంటుంది. ఓటమి ఉంటుంది. ఇద్దరు ఆడితే ఒక్కరే గెలుస్తారు. నిజమే. కానీ ఎలా ఓడిపోయామన్నది ముఖ్యం. పోరాడి ఓడితే విజేతతో సమానంగా గౌరవం దక్కుతుంది. ఆసీస్ సిరీస్ లో ఎవరెవరు సెంచరీ చేశారు, ఎవరెన్ని వికెట్లు తీశారనేది పక్కన పెడితే, ఒట జట్టుగా ఆత్మ విశ్వాసంతో ఆడక పోవడం, గెలవాలనే కాంక్ష లేకపోవడం వల్లే వరసగా ఓడిపోయారు. పరాయి దేశం కాబట్టి ఓడిపోయామనేది సాకు మాత్రమే. ఇతర దేశాల్లో ఆడి సిరీస్ లు గెలిచిన జట్లు చాలా ఉన్నాయి. ఒకప్పుడు భారత్ కు కూడా ఇలాంటి రికార్డులున్నాయి.

ఆదివారం నాటి మ్యాచ్ లో భారత్ 6 వికెట్లకు 295 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. సిరీస్ ను గెల్చుకుంది. భారత జట్టులో తరచూ లోపించేది ఒకటుంది. అది, దేశం కోసం ఆడుతున్నాం కాబట్టి గెలుపు లక్ష్యం కావాలనే తపన లేకపోవడం. ఆడినా, ఓడినా కోట్ల రూపాయల డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతోంది. బోర్డు పెద్ద దీవెనలుంటే కొన్నేళ్లపాటు జట్టులో స్థానానికి డోకా లేదు. కాబట్టే కొందరు స్టార్ ప్లేయర్స్ ఇష్టారాజ్యంగా ఆడుతున్నారని క్రికెట్ అభిమానులు బాధ పడుతుంటారు. వాళ్లను చూసి కొత్త వాళ్లలో కూడా గెలవాలనే కసి తగ్గిపోతోంది.

గెలుపు రెండు సార్లు లభిస్తుంది. మొదట మైండ్ లో. తర్వాత గ్రౌండ్ లో. గెలవాలని అనుకునే వారు, గెలుస్తామని తమను తాము నమ్మేవాళ్లు కచ్చితంగా గెలుస్తారు. లేదా హోరాహోరీగా పోరాడి ఓడిపోతారు. మన జట్టులోని కొందరు ఆటగాళ్లలో జోష్, తెగింపు, పట్టుదల, విజయ కాంక్ష ఉన్నట్టు కనిపించదు. కొద్ది మంది మాత్రమే ప్రాణాలకు తెగించి అయినా సరే గెలవాలనే పట్టుదలతో ఆడుతారు. కానీ ఏం లాభం?క్రికెట్ అనేది టీమ్ గేమ్. అందరూ సమన్వయంతో, కసిగా ఆడితేనే కదా గెలిచేది. మొత్తానికి ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడిన అన్ని మ్యాచ్ లను ఓడిపోవడం అనే రికార్డును మనోళ్లు సృష్టిస్తారా? ఇక ముందైనా నిజంగా దేశం కోసం ఆడి గెలుస్తారా? చూద్దాం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close