కొండను తవ్వేశారు ఎలుకైనా దొరుకుతుందా!

ప్రభుత్వానికి బిగుస్తున్న ‘కాపుముడి’

ముద్రగడ పద్మనాభం దీక్ష ముగియడం ఇక లాంచనమే! అయినప్పటికీ, ఉద్రిక్తతలు సమసిపోయాయి. బిసి రిజర్వేషన్లను కాపులకూ వర్తింపజేయడంలో వున్న సమస్యలు తెలిసికూడా అరెస్టుల ద్వారా ముద్రగడను రెచ్చగొట్టినందువల్ల రిజర్వేషన్ల హామీ ఇచ్చిన చంద్రబాబు చూట్టూ ”కాపుముడి” మరింత బిగుసుకుంది.

నిజానికి కాపులను బిసిల్లోకి చేర్చటమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. అగ్రవర్ణాన్ని బిసిల్లోకి చేర్చాలంటే అందుకు ఒక కమీషన్ వేయాలి. జనాభా లెక్కలతో పాటు సామాజిక గణాంకాలు నమోదు చేయాలి. అవన్నీ ఒక ఫార్టేటులో పూర్తి చేసిన తర్వాత ఆర్టికల్ 9 కి సవరణలు కోరుతూ నివేదికను కేంద్రానికి పంపాలి. అప్పుడు ఆ నివేదికను కేంద్ర హోంశాఖ, న్యాయ శాఖ, అధ్యయనం చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకుని మంత్రివర్గ సమావేశం ముందుకు తెస్తుంది. మంత్రివర్గ సమావేశం ఆమోదంతో ఫైల్ సవరణలు కోరుతూ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. పార్లమెంట్‌లో సవరణలు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపుతారు.

ఇదంతా చంద్రబాబుకి తెలియకకాదు… ఎన్నికల్లో గెలవడానికి చేసిన వాగ్దానాల్లో కాపులకు బిసి రిజర్వేషన్ కూడా ఒకటి. హామీలు అమలు చేయలేదని విమర్శించేవారే తప్ప నిలదీసేవారు సాధారణంగా వుండరు. అందుకు భిన్నంగా ముద్రగడ కాపుల రిజర్వేషన్ పై పట్టుబట్టారు. తునిలో సభపెట్టారు. రైళ్ళను తగలబెట్టారు. ముద్రగడ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వం హడావిడిగా మంజునాధ కమీషన్ ను నియమించింది. కమీషన్ రిపోర్టు రాకముందే రాంగ్ టైమ్ లో విద్వంసకారుల అరెస్టులు మొదలు పెట్టారు. ముద్రగడకు ఉద్యమలబ్ది దక్కనీయకుండా ఆయన అనుచరులు విధ్వంసకారులన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపడమే తెలుగుదేశం ఎత్తుగడగా అర్ధం చేసుకున్న ముద్రగడ మళ్ళీ దీక్ష ప్రారంభించారు.

ముద్రగడ జగన్ మనిషి అని మంత్రులే ఆరోపించడం మొదలు పెట్టారు. ఎవరు చెప్పినా వినని మొండి పెంకి వాడు అన్న విమర్శతప్ప ఇంటెగ్రిటీని శంకించే వీలు లేని వ్యక్తిత్వం ఆయనది. ఈ నేపధ్యంలో కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులందరూ ఏకతాటిపైకి రావటంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక వర్గం మొత్తం ఏకమవుతూండటం ఇతరజిల్లాలకు ఇది పాకుతూండటంలో ప్రభుత్వానికి దిగిరాక తప్పని పరిస్ధితి ఏర్పడింది.

ప్రతిష్ట దెబ్బతిని కూడా రాష్ట్రప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ సాధించగలదా అన్నది అనుమానమే. మంజునాద్ కమీషన్ రిపోర్టుని కేంద్రానికి పంపడం వరకే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో వున్న పని.

అయితే గుజరాత్ లో పటేళ్ళు, హర్యానాలో జాట్లు, రాజస్ధాన్‌లో గుజ్జర్లు రిజర్వేషన్లు కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కేంద్రం పట్టించుకోలేదు. పైగా గుజరాత్‌లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు కూడా ఉన్నాయి. అటువంటిది ఆంధ్రప్రదేశ్‌లోని కాపులను బిసిల్లోకి చేర్చే అంశానికి అంత ప్రాధాన్యత ఇస్తుందని ఎవరూ అనుకోవటం లేదు.

ఏ విధివిధానాలూ పాటించకుండా గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్ ప్రకటిస్తే న్యాయస్ధానం కొట్టేసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా గతంలో ఒకసారి అనుమానాన్ని వ్యక్తం చేసారు. అందుకనే కాపులను బిసిల్లో చేర్చటమనే ఎన్నికల హామీ అమల్లోకి రావటం అంత తేలికకాదని అర్ధమౌతోంది.

ఈ వ్యవహారమంతా చూస్తే కొండను తవ్వేస్తున్నారు ఎలుకనైనా పట్టుకోగలరా అన్న అనుమానం వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close