కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే ప్రతిపక్షంలో ఎవరు ఉంటారు ..?: రేవంత్

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ , ఆయన కుమారుడు కేటీఆర్ ను కార్నర్ చేయడంలో.. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్టైల్ వేరుగా ఉంటుంది. తాజాగా… ఎన్నికల ప్రచారంలో.. తాను ఓడిపోతే.. తనకేం నష్టం లేదని.. ఇంట్లో రెస్ట్ తీసుకుంటానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి అదే విధమైన కౌంటర్ ఇచ్చారు. మరి ప్రతిపక్షంలో ఎవరు ఉంటారని ప్రశ్నించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ లను . బిల్లారంగాలుగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఓడిపోతే కేటీఆర్‌ అమెరికాకు..కేసీఆర్‌ ఇంటికి పోతానంటున్నారు ..అధికారం లేకపోతే ప్రజలకు సేవచేయరా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఆర్థిక నేరగాడు..పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని .. వెంటనే రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసి పాస్‌పోర్టు సీజ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

మరో వైపు కొడంగల్ ర్యాలీలో… టీఆర్ఎస్ ఓడిపోతే.. రాజకీయ సన్యాసానికి సిద్ధమని.. తన సవాల్ స్వీకరించాలని.. కేటీఆర్ చేసిన ప్రకటనపైనా రేవంత్ అంతే విభిన్నంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాతో సవాల్ చేసేందుకు కేటీఆర్ ఓనర్ కాదు..పనోడని తీసి పడేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే లోక్‌సభ ఎన్నికల్లో నాతో పోటీకి సిద్ధపడాలని సవాల్ చేశారు. గతంలో కేసీఆర్‌ పోటీ చేసిన మహబూబ్‌నగర్‌ ఎంపీకి పోటీ చేద్దామన్నారు. చేతనైతే కేటీఆర్ సవాల్ ను స్వీకరించాలని చాలెంజ్ చేశారు. టీడీపీతో పొత్తుపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కూడా రేవంత్ తిప్పికొట్టారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు అనుకున్నా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేరని చంద్రబాబుపై నెపం పెట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దృష్టి మళ్లించి దోచుకునే దొంగ కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పై …రేవంత్ మైండ్ గేమ్ కొనసాగిస్తున్నారు. మరికొందరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు కాంగ్రెస్‌లోకి వస్తారని.. ఎంపీలే కాదు, ఎమ్మెల్సీలు కూడా వస్తారని కేసీఆర్‌, కేటీఆర్‌కు దమ్ముంటే వారిని ఆపుకోమని సవాల్ చేస్తున్నారు.

కేసీఆర్ ఏ ఉద్దేశంతో… ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటాననే వ్యాఖ్యలు చేశారో కానీ.. కాంగ్రెస్ పార్టీ నేతలకు జోష్ ఇచ్చినట్లయింది. సోషల్ మీడియాలో.. వాటిని కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఆశలు వదులుకుందన్న అభిప్రాయాన్ని బలంగా ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ కు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close