సీపీఐకి ఒక్క సీటిచ్చి పొత్తు ఖరారు చేసుకున్న రేవంత్

కమ్యూనిస్టుల్లో ప్రధానమైన సీపీఐతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తో పొత్తు ఖరారు చేసుకున్నారు. ఒక్కటంటే ఒక్క సీటు ఇచ్చి సీపీఐని కన్విన్స్ చేశారు. రెండు సీట్లు కోసం పట్టుబడుతూ వచ్చిన ఆ పార్టీ చివరికి కొత్తగూడెం ఇస్తే చాలనుకుని సర్దుకుంది. నిజానికి కొత్తగూడెంకు కూడా కాంగ్రెస్ తరపున ఓ అభ్యర్థి రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరేందుకు జలగం వెంకట్రావు రెడీగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలనుకుంది. అందుకే ఆయనకు రెడ్ సిగ్నల్ ఇచ్చి… సీపీఐతో పొత్తు ఖరారు చేసుకుంది.

చెన్నూరు సీటును కూడా ఇవ్వాలని పట్టుబట్టింది. ముందుగా కాంగ్రెస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ బీజేపీ నుంచి మాజీ ఎంపీ వివేక్ వచ్చి చేరడంతో ఆయనకు లేదా ఆయన కుమారుడికి టిక్కెట్ ఖరారు చేస్తున్నారు. దాంతో ఆ సీటు సీపీఐకి కాకుండా పోయింది. ఎన్నికల్లో గెలిచినాక రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఏదో ఒకటిలే అని సీపీఐ సర్దుకుపోయింది. కానీ సీపీఎం మాత్రం తగ్గడం లేదు. ఒక్క స్థానానికి అంగీకరించకపోవడంతో.. ఆ పార్టీని నేతలు పట్టించుకోలేదు. మిర్యాలగూడ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తూండటంతో సీపీఎం కాంగ్రెస్ ను బెదిరిస్తున్నట్లుగా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.

సీపీఎంను కూడా ఒక్క సీటుకు ఒప్పించి.. మిర్యాలగూడతో సరి పెట్టే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తోంది. ఎంత వరకూ అంగీకరిస్తారో కానీ.. సీపీఎం కన్నా సీపీఐనే బలమైన పార్టీ. అయితే రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిస్తేనే ఓ మూడు, నాలుగు శాతం ఓట్లు కలిసి వస్తాయన్న అంచనా ఉంది. అదీ కూడా కొన్ని సెలక్టివ్ నియోజకవర్గాల్లోనే. మొత్తంగా రేవంత్ కోదండరాంతో చర్చలు జరిపి ఆ పార్టీ మద్దతు ప్రకటింపచేసుకున్నారు. షర్మిల పార్టీని దూరం పెట్టినా ఆపార్టీ మద్దతు పొందారు. ఒక్క సీటు ఇచ్చి కమ్యూనిస్టుల మద్దతూ పొందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close