తప్పు ప్రైవేటు ఆస్పత్రులదేనా..? ప్రభుత్వానిది లేదా..?

దేశంలో ఓ విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ప్రైవేటు విద్యా సంస్థలపై తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేస్తారు. అలా చేసేవాళ్లు కూడా.. తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించరు. ఒక్క స్కూళ్లు అనే కాదు.. ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవస్థ మీదా నమ్మకం ఉండదు. ప్రైవేటులో అయితే మంచి క్వాలిటీ సర్వీస్ లభిస్తుందని నమ్ముతారు. వైద్యవ్యవస్థ కూడా అంతే. ప్రభుత్వ ఆస్పత్రులకు.. కాస్త డబ్బున్న వాళ్లు ఎవరూ వెళ్లరు. ఓ మాదిరి ప్రైవేటు ఉద్యోగులు కూడా… ఏదైనా సుస్తీ చేస్తే.. ప్రైవేటు ఆస్పత్రికే వెళ్లి వైద్యం చేయించుకుంటారు. ఈ కరోనా కాలంలో ప్రజల ప్రాణాలకు అంతో ఇంతో అడ్డేస్తుంది ప్రైవేటు ఆస్పత్రులే. కానీ ఇప్పుడు ఆ ఆస్పత్రుల మీద వ్యతిరేక ప్రచారం ఓ రేంజ్‌లో సాగుతోంది.

ప్రైవేటు వైద్యాన్నే నమ్ముకున్న కరోనా రోగులు..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రులపై దండయాత్ర జరుగుతోంది. షోకాజ్ నోటీసులు, జరిమానాలతో ప్రభుత్వాలు హడలెత్తిస్తున్నాయి. తెలంగాణలో తీవ్రమైన విమర్శలు.. ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తప్పనిసరిగా కదిలింది. కానీ ఏపీలో మాత్రం… చాలా రోజులుగా ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌లు పెట్టి దాడులు చేయిస్తున్నారు. మంత్రి కొడాలి నాని లాంటి వాళ్లయితే.. ఆయన స్టైల్ లాంగ్వేజ్‌లో విరుచుకుపడుతున్నారు. నిజంగా ప్రైవేటు ఆస్పత్రులు ప్రచారం చేస్తున్నంత దారుణాలకు పాల్పడుతున్నాయా.. అంటే…అందరూ.. ప్రైవేటు ఆస్పత్రులకే ఎందుకెళ్తారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.

లక్షలు దోచేస్తున్నాయని ఇప్పుడు ఆస్పత్రులపై దాడులు..!

నిజానికి మహమ్మారి సమయంలో ప్రజలను ఆదుకున్నవి ప్రైవేటు ఆస్పత్రులే. కరోనా వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులపైనే ప్రజలు ఆధారపడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన తర్వాతే ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు కానీ.. మొదటి చాయిస్‌గా ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్లారు. ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ ఇస్తాయా లేదా అని కూడా ఆలోచించలేదు. ఇళ్లు.. ఒళ్లు తాకట్టు పెట్టి మరీ ప్రైవేటు ఆస్పత్రులైతేనే ప్రాణాలు కాపాడతాయని నమ్మారు. ప్రైవేటు ఆస్పత్రుల సేవలు లేకపోతే.. ప్రభుత్వ వైద్య రంగం తీవ్రఒత్తిడికి గురయ్యేది.సెకండ్ వేవ్‌లో చేతులు ఎత్తేసేవాళ్లే.

ప్రభుత్వ వైద్యం సక్రమంగా ఉంటే ప్రైవేటు ఆటలు సాగేవా..?

ఈ విషయం ప్రభుత్వ వ్యవస్థలకు తెలియనివి కావు. అయినప్పటికీ.. ప్రైవేటు ఆస్పత్రులపై దాడులు చేస్తున్నారు. ఏపీలో సర్కార్ ప్రైవేటు ఆస్పత్రులను.. దారుణంగా ట్రీట్ చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్.. ప్రజల్ని దోచుకోవడానికే ఆస్పత్రులని నమ్ముతున్నారు. ఆయన టీకాలు కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయవద్దని ప్రధానికి లేఖ రాశారు. నిజానికి ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ప్రైవేటు ఆస్పత్రులు చికిత్సలు చేడంలేదు. ఈ కోపంతోనే ప్రభుత్వం ఇలా ఆగ్రహం చూపిస్తోందని అంటున్నారు.

తప్పు ప్రభుత్వానిదే ఎక్కువ..!

అయితే ప్రైవేటు.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లోపాలు లేవని కాదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజులపై ఎప్పట్నుంచో విమర్శలు ఉన్నాయి. ఏ ఆస్పత్రిలోనైనా ఇన్‌పేషంట్‌గా చేరితే రూ. లక్ష బిల్లు గ్యారంటీగా వేస్తారు. కానీ నియంత్రించడానికి వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. ఆస్పత్రుల్లో చార్జీలను నియంత్రించే వ్యవస్థలు అసలు పని చేస్తే సమస్యే ఉండేది కాదు. కానీ మహమ్మారి సమయంలో … దాడులు చేస్తూ.. రాజకీయం చేయడంమే వివాదాస్పదమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ కు సపోర్ట్ గా ప్రభాస్ ఫ్యామిలీ

పిఠాపురం నుంచి పోటీ చేస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కొణిదెల ఫ్యామిలీతోపాటు పలువురు సినీ ప్రముఖులు నియోజకవర్గంలో వాలిపోయి పవన్...

అవధూతగా ప్రభాస్ ?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై ఇటివలే అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రభాస్ సెట్స్ లో అడుగుపెట్టారని అభిమానులుని సర్ ప్రైజ్...

ఈటీవీ విన్… ఇలా అయితే కష్టమే!

'ఈనాడు' ఏ రంగంలో అడుగుపెట్టినా అగ్రగామిగా నిలవడానికే ప్రయత్నిస్తుంది. ఈ సంస్థ 'ఈటీవీ విన్' తో ఓటీటీలోకి ప్రవేశించింది. అయితే ఇప్పటివరకూ ఆ ఓటీటీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ లో '90s' తప్పితే...

అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సిద్దమైందా..? నష్టాల పేరిట మెట్రోను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే మెట్రోను ఇప్పట్లో అమ్మకానికి పెట్టడం లేదని...2026 తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close