రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. డిసెంబరు 12న ‘మోగ్లీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా టీజర్‌ను వదిలారు. అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది.
జై హనుమాను గురుదేవుడు నాయద పద్యంతో టీజర్ ఓపెన్ చేశారు. టీజర్ ఇది సీతారాముల ప్రేమ కథ అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. హీరోకి పోలీసు అవ్వాలని కల, తను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి మాటలు రావు. చక్కగా సాగిపోతున్న ప్రేమ కథలో రావణాసురుడు లాంటి ఒక పోలీసు ఎంటర్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందనేది తెరపై చూడాలి.
టీజర్ ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి నేపథ్యంలో ప్రేమ కథలు రాలేదనే చెప్పాలి. రోషన్ కనకాల నేచురల్ గా కనిపించాడు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి చివరిలో టపాసుని బాణంగా విసిరే సీన్ ని క్రియేటివ్ గా ఆలోచించారు.
సందీప్ రాజ్ మరో బలమైన ప్రేమ కథనే చూపించాడని అనిపిస్తుంది. కాలభైరవ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలని ఎలివేట్ చేసింది. సరోజ్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేశాడు. తన క్యారెక్టర్ పూర్తి నెగిటివ్ షెడ్ లో వుంది. తన పెర్ఫార్మన్స్ కూడా ఈ సినిమాకి కీలకం. మొత్తానికి సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది.

