శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతి : సుప్రీంకోర్టు

కేరళ శబరిమలోని ప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయంలో ఇప్పటి వరకూ… యాభై ఏళ్ల లోపు మహిళలకు ప్రవేశం లేదు. కానీ సుప్రీంకోర్టు.. ఈ నిషేధాన్ని ఎత్తి వేస్తూ తీర్పు వెల్లడించింది. మహిళలకు సహజంగా వచ్చే రుతుస్రావ సమస్యలను కారణంగా చూపుతూ..ఇంత కాలం ఆలయ వర్గాలకు మహిళలకు ప్రవేశం కల్పించేవి కావు. దీనిపై స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాయి. వీటిపై సుప్రీంకోర్టు పలు దఫాలుగా విచారణ జరిపి తుది తీర్పు వెల్లడించింది. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలో వారికి నిషేధం విధించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పురుషులతో పోలిస్తే మహిళలు దేనిలోనూ బలహీనులు కారని వ్యాఖ్యానించింది. ఆలయాల్లో లింగవివక్షకు తావులేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.మతమనేది ప్రాథమిక జీవనవిధానంలో భాగమేనని సీజే దీపక్ మిశ్రా అన్నారు.

శ‌బ‌రిమ‌ల అయ్యప్ప ఆల‌యంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం.. దశాబ్దాల నుంచి ఉంది. అక్కడ దీనిపై రాజకీయం కూడా జోరుగా నడుస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మహిళల ఆలయ ప్రవేశానికి వ్యతిరేకంగా.. ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పుడు అందుకు సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు. సుప్రీంకోర్టులో ఈ విచారణ జరుగుతున్న సమయంలో.. కేరళ ప్రభుత్వం ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం కల్పించాల్సిందేనన్న వాదన వినిపించింది. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

2007లో కేరళలో అధికారంలో ఉన్న అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని పట్టుబట్టింది. దాని కోసం కొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సీన్ మారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో… సుప్రీకోర్టులో కేసు కడా వాదనకు రావడంతో అనుకూలంగా కేరళ ప్రభుత్వం వాదించింది. దీంతో మహిళల ఆలయ ప్రవేశానికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. కొసమెరుపేమిటంటే… కొద్ది రోజుల కిందట వచ్చిన వరదలకు… ఈ ఆలయంలో మహిళల ప్రవేశానికి లింక్ పెట్టి చాలా మంది విమర్శలు చేశారు. ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. వారంతా ఇప్పుడు ఎలా స్పందిస్తారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close