ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌కు సాక్షి మార్కు వ‌క్రీక‌ర‌ణ‌!

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌మే ప‌రిపాల‌న చేస్తోందేమో అన్న‌ట్టుగా ఉంటుంది వైకాపా ప‌త్రిక సాక్షి తీరు! ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలుగానీ, చివ‌రికి ముఖ్య‌మంత్రి చేస్తున్న వ్యాఖ్య‌ల్నిగానీ వారికి అనుకూలంగా ఏ స్థాయి వ‌క్రీక‌ర‌ణ‌కైనా వెన‌కాడ‌టం లేదు. ఈ మ‌ధ్య ఓట్ల తొల‌గింపు మీదే సాక్షి ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఓట‌మిపై భ‌యంతోనే త‌మ ఓట్ల‌ను తెలుగుదేశం పార్టీ తొల‌గిస్తోంద‌న్న‌ది వారి ఆరోప‌ణ‌. ఇక‌, ఇవాళ్టి ప‌త్రిక‌లో… ఈ తొల‌గింపు కార్య‌క్ర‌మం చిన‌బాబు క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతోంద‌ని విమ‌ర్శించింది. కొంత‌మందికి ఔట్ సోర్సింగ్ కి ఇచ్చి మ‌రీ ఓట‌ర్ల జాబితాలో తొల‌గింపుల‌కు పాల్ప‌డుతున్నారని పేర్కొన్నారు. అన్ని ర‌కాల సేవ‌ల్ని ఓట‌ర్ల తొల‌గింపు కోస‌మే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వినియోగించేసుకుంటున్నానీ, చివ‌రికి క‌లెక్ట‌ర్లూ ఉన్న‌తాధికారులూ ఇదే ప‌నిలో ఉన్నార‌ని రాసేశారు.

ఇటీవ‌ల కేబినెట్ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్థావిస్తూ… ఆర్టీజీఎస్‌, ఇ-ప్ర‌గ‌తి స‌మిష్టిగా ప‌నిచేసేలా చూడాల‌ని ఆయ‌న అన్నార‌నీ, అన్ని సేవ‌ల‌నీ ఆన్ లైన్ లో రియ‌ల్ టైమ్ లో అందించాల‌ని చూడాల‌న్నారని చెప్పారు. ఎన్నిక‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు అందించే సేవ‌ల‌కి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాల‌ని సీఎం చెప్పార‌ని రాశారు. అయితే, ఇలా చెప్ప‌డం ద్వారా ప‌రోక్షంగా అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ విన‌యోగించుకోండ‌ని టీడీపీ నాయ‌కులకి సీఎం చెప్పార‌ట‌! సాక్షి మార్కు వ‌క్రీక‌ర‌ణ అంటే ఇదే. ఎన్నిక‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు అందించే సేవ‌ల విష‌యంలో ఇబ్బంది రాకూడ‌దూ అని సీఎం అంటే… అందుబాటులో ఉన్న అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం వాడేసుకోండ‌ని సాక్షికి వినిపించింది. వాస్త‌వానికి సీఎం చేశారంటూ వారే రాసిన వ్యాఖ్య‌ల్లో రెండో అర్థానికి ఆస్కార‌మే లేదు. కానీ, సాక్షి విశ్లేష‌ణాత్మ‌క దృష్టికి రెండో కోణం క‌నిపించేసింద‌ట‌!

ఇంకోటి, ఓట‌ర్ల తొల‌గింపు కోసం క‌లెక్ట‌ర్ల‌నీ, ఉన్నతాధికారుల‌ను సీఎం వాడేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. అదెలా వాడతారో కూడా చెబితే బాగుంటుంది క‌దా. వైకాపా మ‌ద్ద‌తుదారుల ఓట్ల‌ను తొల‌గించ‌డం అనేది ఒక ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంగా సీఎం అమ‌లుచేస్తున్న‌ స్థాయిలో సాక్షి ఆరోపిస్తోంది. గ‌త కొద్దిరోజులుగా సాక్షి ఇంత గొంతు చించుకుంటోందిగానీ… ఇంత‌వ‌ర‌కూ ప‌క్కాగా ఆధారాల‌ను ప్ర‌జ‌ల‌కు చూప‌లేక‌పోయింది. ఓట‌మికి ఒక బ‌ల‌మైన కార‌ణాన్ని ముందుగానే వెతికిపెట్టుకునే బ‌ల‌మైన ప్ర‌య‌త్నంగా ఈ మ‌ధ్య సాక్షి తీరు క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close