రేట్లు పెంచలేదు.. కమిషన్ పెంచాల్సి వచ్చింది..! సాక్షి బాధలు సాక్షివి..!!

తెలుగు దిన పత్రికలు ధరలు పెంచాయి. సాధారణ రోజుల్లో రూ. ఐదు నుంచి ఆరున్నరకు పెంచాయి. అంటే రూపాయిన్నర పెంచాయి. ఆదివారాల్లో రూ. ఆరు నుంచి.. రూ. ఎనిమిది చేశాయి. దానికి తగ్గట్లుగానే… ఏజెంట్లు, హాకర్లకు ఇస్తున్న కమిషన్లలో మార్పులు చేశాయి. కానీ… ఇక్కడ విశేషం ఏమిటంటే… వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి… కరపత్రిక.. సాక్షి మాత్రం ధరుల పెంచలేదు. ఇప్పటికే సర్క్యూలేషన్ తిరోగమనంలో ఉండటంతో… ధరుల పెంచితే.. మొదటికే మోసం వస్తుందన్న భయంతో… సాక్షి పత్రిక యాజమాన్యం రేటు పెంచడానికి సిద్ధం కాలేదని సమాచారం. ఈనాడు .. పద్దెనిమిది లక్షల వరకూ సర్క్యూలేషన్‌తో ఉండగా.. సాక్షి పత్రిక తొమ్మిది లక్షల దగ్గరే తచ్చాడుతోంది. ఈ పొజిషన్‌ను నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. రిపోర్టర్లు, స్ట్రింగర్లతో.. సర్క్యులేషన్ బాధ్యతలు మోయిస్తున్నారు. ఎన్ని చేసినా.. ఒక్క నెలకే.. అన్నీ రివర్స్ అవుతున్నాయి.

పైగా సాక్షి దినపత్రికను కోనుగోలు చేసేవారిలో అత్యధికులు.. పార్టీ సానుభూతి పరేలు. ప్రధానంగా ఏపీలో.. వైసీపీ శ్రేణులే… సానుభూతి పరులే సాక్షి పత్రికను కొనుగోలు చేస్తాయి. అసలైన న్యూస్ కోసం అయితే.. ఇతర పత్రికలను చూడాల్సిందే. అంతగా… వైసీపీకి.. జగన్ కు పత్రిక అంకితమయింది కాబట్టి.. ఇప్పుడు రేటు పెంచితే.. ఎందుకొచ్చిన బాధ అని ఆ క్యాడర్ అనుకునే ప్రమాదం ఉంది. అందుకే.. కష్టాలు, నష్టాలు భరించి.. వచ్చే ఎన్నికల వరకూ… రేట్లు పెంచకుండా నెట్టుకొస్తే.. ఆ తర్వాత పెట్టుబడులు వస్తాయనే.. అంచనాలో ఉన్నట్లు ఉన్నారు. అయితే… ఇలా రేటు పెంచకుండా ఉంటే సరిపోదని… కొత్తగా వారికి తెలిసొచ్చింది. ఏజెంట్లు, హాకర్‌లకు.. కమిషన్ పెంచాల్సి వచ్చింది.

ఇతర తెలుగు దినపత్రికలు.. రేట్లు పెంచాయి కాబట్టి.. కమిషన్ పెంచాయి. వాళ్లంతా కమిషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి… సాక్షి పేపర్‌ను… పక్కన పెట్టేసి.. ఆ పత్రికలు…వినియోగదారులకు అంటగట్టడం ప్రారంభించారు. ఒకటి, రెండో రోజుల్లోనే ఈ తేడా కనిపించడం.. కమిషన్ పెంపుపై… ఏజెంట్లు, హాకర్ల నుంచి ఒత్తిడి రావడంతో… ఇతర పత్రికలతో పాటుగా కమిషన్ పెంచాల్సి వచ్చింది. అంటే.. అదనపు ఆదాయం లేకపోగా.. కమిషన్ పెంచాల్సి వచ్చిందన్నమాట. నిజానికి ఈ పరిస్థితి.. గతంలో… సాక్షి పత్రిక.. ఇతర పేపర్లకు తెచ్చి పెట్టింది. వైఎస్ హయాంలో వచ్చి పడిన పెట్టుబడులతో.. పత్రికను.. మార్కెట్లోకి తీసుకొచ్చిన సాక్షి… రూ. 2కే పత్రికను మార్కెట్లోకి తెచ్చి…అందులోనూ… రూపాయిపైనే… ఏజెంట్లకు కమిషన్ ఇచ్చింది. ఈ కారణంగా.. అప్పట్లో మూడు రుపాయులు ఉన్న ఇతర పత్రికల యామాన్యాలు కమిషన్ పెంచక తప్పలేదు. ఇప్పుడు సాక్షిగా.. అదే ఎఫెక్ట్ రివర్స్‌తో తగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close